తెలంగాణ గవర్నర్‌కు బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలు శుక్రవారం బహిరంగా లేఖ రాశారు.
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ గవర్నర్‌కు బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలు శుక్రవారం బహిరంగా లేఖ రాశారు. కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సామాజిక విప్లవ భూమి అయినా తెలంగాణ రాష్ట్రంలోకి గౌరవపూర్వకంగా స్వాగతం పలికారు. తన అపార అనుభవం గొప్ప జ్ఞానంతో తెలంగాణ అపారంగా అభివృద్ధి చెందుతుందని, పేదలకు న్యాయం జరుగుతుందని, రాజ్యాంగాన్ని పరిరక్షించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారని తమకు చాలా నమ్మకం ఉందన్నారు.
ఎమ్మెల్సీల నియమాకం విషయమై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నందున తుది నిర్ణయం తీసుకోవద్దని లేఖలో పేర్కొన్నారు. కేసు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపిన కోదండరామ్, అలీఖాన్ పేర్లపై గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. గతంలో బీఆర్ఎస్ హాయంలో దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యనారాయణలను గవర్నర్కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫారసు చేయగా అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. దీంతో కేబినెట్ నిర్ణయాన్ని తిరస్కరించే అధికారం గవర్నర్‌కు ఉందా లేదా అన్న అంశంపై దాసోజు, కుర్ర కోర్టుకు వెళ్లారు. అప్పటిదాకా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఎవరినీ నియమించవద్దని వారు లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగత అపాయింట్‌మెంట్ కోసం వారు గవర్నర్‌కు అభ్యర్థించారు. తమ న్యాయబద్ధమైన ఆందోళనలను వ్యక్తిగతంగా తెలియజేయడానికి ఈ విషయంపై అవసరమైన మరిన్ని వివరణలను అందించడానికి అపాయింట్‌మెంట్ ఇవ్వలని కోరారు.