ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ప్రజలతో దోస్తీనా, లేక నేరస్తులతో గూండాలతో దోస్తీనా?? జవాబు మీరే చెప్పాలని బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ డీజీపీను ప్రశ్నించారు.
న్యూస్ లైన్ డెస్క్: ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ప్రజలతో దోస్తీనా, లేక నేరస్తులతో గూండాలతో దోస్తీనా?? జవాబు మీరే చెప్పాలని బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ డీజీపీను ప్రశ్నించారు. కాగజ్ నగర్ టౌన్ & రూరల్ పోలీసు అధికారులు యూనిఫాంలో కోనేరు క్రిష్ణ అనే ఒక నిందితుడి ఇంటికి వెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీఐపీ బర్త్ డే బాయ్ ఎవరో కాదు, మూడు సంవత్సరాల క్రితం డ్యూటీలో ఉన్న ఒక మహిళా ఫారెస్టు అధికారి అనిత మీద దారుణంగా దాడి చేసి జైలుకు పోయిన దుండగుడు.
తరువాత 2023 నవంబరు 30 నాడు కాగజ్ నగర్ డీయస్పీ, ఇతర పోలీసుల మీద రౌడీల మూకతో ఇతనే దాడి చేయించాడు. అయినా ఇతని మీద అధికారులు ఎందుకో చర్య తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. మాజీ జడ్పీటీసి, మాజీ ఎమ్మెల్యే తమ్ముడు, ఇప్పుడు అధికార పక్షంలో ఉండడం, ఒక నిందితుడు కావడమేనా ఇతనికున్న అర్హత అని ప్రశ్నించారు. ఆసలు ఈయన ఏదైనా ఎమ్మెల్యేనా, లేదా మినిస్టరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు సామాన్య ప్రజలకు కూడా ఇళ్లలోకి వెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతరా? లేదా కేవలం అధికారపార్టీ కి చెందిన బలమైన నిందితుల ఇండ్లకే పోతరా అని నిలదీశారు. ఇట్ల చేస్తే సామాన్యపౌరులకు పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేస్తదని నమ్మకం ఎట్ల కలుగుతది అని ప్రవీణ్ కుమార్ పోలీసులను హెచ్చరించారు.