కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐటీ ఉద్యోగాల కల్పన భారీగా పడిపోయిందని బీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐటీ ఉద్యోగాల కల్పన భారీగా పడిపోయిందని బీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీన్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ హయంలో కేవలం 9.5 సంతర్సంలో 6 లక్షల ఉద్యోగలు కల్పించిందని ఆయన తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం 47 వేల ఉద్యొగాలకు పడిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న అమరాజా కంపెనీ ప్రభుత్వం నుంచి సహకారం రావడం లేదని ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు.
బీజేపీ నాయకులు భావ దారిద్ర్యంతో ఉన్నారు. భూములులాక్కుంటున్నారని కొడంగల్ రైతులు ఆందోళన చేస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి.. రేవంత్‌కు సహాయ మంత్రిగా మారిపోయారని, రేవంత్ రెడ్డికి కోవర్టుగా పనిచేస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్ కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉండి కేటీఆర్‌ని అరెస్ట్ చేయాలి అని అంటున్నాడని, ఎందుకు అరెస్ట్ చేయాలి తెలంగాణలో హైదరాబాద్ నగరానికి లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చి, 25 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు అరెస్ట్ చేయాలా అని వివేకానంద నిలదీశారు.