తాము ముందుగా ప్లాన్ చేసుకున్న దారిలోనే వెళ్తామని కాంగ్రెస్ కార్యకర్తలు పంతం పట్టారు. దీంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో సిద్ధిపేట పట్టణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
న్యూస్ లైన్ డెస్క్: సిద్దపేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్యన పోటీ హోరాహోరీగా సాగుతోంది. రెండు పార్టీల కార్యకర్తలు ర్యాలీగా వెళ్తుండగా .. ఇరువర్గాలు ఎదురుపడ్డాయి. అయితే, మరోదారిలో వెళ్లాలని పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. తాము ముందుగా ప్లాన్ చేసుకున్న దారిలోనే వెళ్తామని కాంగ్రెస్ కార్యకర్తలు పంతం పట్టారు. దీంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో సిద్ధిపేట పట్టణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇది ఇలా ఉండగా.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటాపోటీ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఓవైపు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం.. మరోవైపు రుణమాఫీపై బీఆర్‌ఎస్ నిరసన కార్యక్రమం జరగనుంది. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు ర్యాలీని డైవర్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.