KTR: రుణమాఫీపై సీఎం రేవంత్‌కి కేటీఆర్ సవాల్

కొడంగల్‌కి పోదామా.. కొండారెడ్డిపల్లికి పోదామా... ఎక్కడికైనా సరే పోదాం.. అక్కడ 100% రుణమాఫీ అయ్యిందని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానాని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.


Published Aug 16, 2024 04:19:22 AM
postImages/2024-08-16/1723799534_challenge.PNG

న్యూస్ లైన్ డెస్క్: కొడంగల్‌కి పోదామా.. కొండారెడ్డిపల్లికి పోదామా... ఎక్కడికైనా సరే పోదాం.. అక్కడ 100% రుణమాఫీ అయ్యిందని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానాని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఈ పచ్చిమోసాన్ని బీఆర్‌ఎస్ ఎండగడతుందన్నారు. సీఎంకు దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలని ఆయన ఛాలెంజ్ చేశారు. సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి వెళితే రేవంత్ రెడ్డిని ప్రజలు ఫుట్బాల్ ఆడుతారని అన్నారు. సగం కూడా రుణమాఫీ చేయకుండా మొత్తం సంపూర్ణంగా రుణమాఫీ చేశామని చెబితే అది సంపూర్ణంగా దిగజారటమే అని అన్నారు. రుణమాఫీ పచ్చి మోసం, పచ్చి దగా అని కేటీఆర్ అన్నారు. రైతులను మోసం చేసినందుకు సీఎం రేవంత్ పై చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి పిచ్చి, పిచ్చి మాటలు మానేయాలని సూచించారు. సీఎం రైతుల దగ్గరకు పోతే వాళ్లు తనతో చెడుగుడు ఆడుతారని తెలిపారు. ఇంత దిగజారుడు ముఖ్యమంత్రి, దివాళా తీసిన ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదని కేటీఆర్ పేర్కొన్నారు. 

నిన్న రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే ఫుల్ ఫ్రస్ట్రేషన్‌తో రంకెలేశాడని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు దూసుకుపోతున్న బాధానా, భట్టి విక్రమార్క ఎక్కువ తిరుగుతున్నాడని బాధానా? అధిష్టానం పట్టించుకుంటలేదని ఫ్రస్ట్రేషనా అని ప్రశ్నించారు. లంకె బిందెలు, న్యూక్లియర్ చైన్, దిల్ సుఖ్ నగర్ లో విమానం అంటాడు. ఆయనకు కచ్చితంగా మానసిక పరిస్థితి ఏదో అయి ఉంటుందని అన్నారు. గౌడన్నలను కల్లులో నీళ్లు ఎంత కలుపుతారో అంటాడు.. ప్రైవేట్ టీచర్లు ఫెయిలయ్యే వాళ్లు అంటాడు.. మహిళలను కించపరుస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాగ్రా నంగల్, విప్రో, ఇన్ఫోసిస్ సీఈవో అని ఏదేదో మాట్లాడుతూ మానసిక సంతులిత లేకుండా ప్రవర్తిస్తున్నాడని అన్నారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు దీని గురించి పరిశీలించాలని కేటీఆర్ సూచించారు. రుణమాఫీ అయ్యిందంటూ కొంతమంది చిల్లర గాళ్లు పోస్టర్లు పెట్టారని, హరీష్ రావు అడిగనట్లు అసలు రుణమాఫీ అయ్యిందా చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడు అమర్ రాజా సహా చాలా సంస్థలు వెళ్లిపోయే పరిస్థితి ఉందని, ముఖ్యమంత్రే రాష్ట్రం దివాళా తీసిందని మాట్లాడితే మంచిది కాదని.. తను అసెంబ్లీలోనే చెప్పానాని తెలిపారు. డిప్యూటీ సీఎం, సీఎం ఇలా మాట్లాడితే రాష్ట్రానికే నష్టం జరుగుతుందన్నారు. మహిళలకు ఒక్క తులం బంగారం ఇవ్వలేదు. కానీ 8 నెలల్లోనే 19 సార్లు ఢిల్లీకి పోయాడు.. ఇంకా ఎన్నిసార్లు పోతాడో అని కేటీఆర్ విమర్శించారు.
 

newsline-whatsapp-channel
Tags : telangana mla brs ktr cm-revanth-reddy runamafi

Related Articles