మూసీ నది ప్రక్షాళన కాదు.. రేవంత్ ముందు తన నోరును ప్రక్షాళన చేసుకోవాలని బీఆర్ఎస్వీ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
న్యూస్ లైన్ డెస్క్: వినూత్న రీతిలో సిద్దిపేట బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కార్యకర్తలు నిరసన తెలిపారు. శుక్రవారం బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పెద్ద ఎత్తున్న నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి ప్లెక్సీపై ఫినాయిల్ పోసి, బ్రష్‌తో బీఆర్ఎస్వీ కార్యకర్తలు కడిగారు. రేవంత్ రెడ్డిది నోరు కాదు మోరి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద నాయకుడుపై మాట్లాడితే గౌరవం పెరుగుతుందని రేవంత్ అనుకుంటున్నడేమో.. కానీ తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటారని విమర్శించారు.
మూసీ నది ప్రక్షాళన కాదు.. రేవంత్ ముందు తన నోరును ప్రక్షాళన చేసుకోవాలని బీఆర్ఎస్వీ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. హరీష్ రావుది తెలంగాణ ఉద్యమ జాతి అని.. కానీ రేవంత్ రెడ్డిది చర్లపల్లి జైలు జాతి అని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని బీఆర్ఎస్వీ కార్యకర్తలు సూచించారు.