Naga Chaitanya: రెండో పెళ్లికి రెడీ అయిన సమంతని మర్చిపోని చైతూ.. పోస్ట్ వైరల్.?

ప్రస్తుతం సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఏంటయ్యా అంటే.. నాగచైతన్య శోభిత ల రెండో పెళ్లి మాత్రమే.. వీరికి సంబంధించి ఎన్నో వార్తలు మీడియా ముఖంగా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.


Published Aug 09, 2024 03:30:00 PM
postImages/2024-08-09/1723195623_samchai.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఏంటయ్యా అంటే.. నాగచైతన్య శోభిత ల రెండో పెళ్లి మాత్రమే.. వీరికి సంబంధించి ఎన్నో వార్తలు మీడియా ముఖంగా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అయితే ఇన్ని రోజులు తమ మధ్య ఏదీ లేదు అని కప్పిపుచ్చిన ఈ జంట సడన్గా పెళ్లి పీటలు ఎక్కేసరికి అందరి మొహాలు షాకింగ్ లుక్ లోకి మారిపోయాయి. ఇక ఇది చాలదు అన్నట్లు మళ్లీ వేణు స్వామి ఎంట్రీ ఇచ్చి వీరికి కూడా బ్రేకప్..ఈ ఇద్దరు విడాకులు తీసుకోవడం ఖాయం.. కొద్ది సంవత్సరాలే కలిసి ఉంటారు అంటూ ఇలా తనకు తెలిసిన జాతకం ఏదో చెప్పేశారు.

అలా ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ ఎవరయ్యా అంటే నాగచైతన్య శోభితలు మాత్రమే. అయితే ఓ పక్క వీరి ఎంగేజ్మెంట్ విని అక్కినేని ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుంటే మరోపక్క సమంతకు సంబంధించి పాత జ్ఞాపకాలు చైతూ ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు బయట ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నాగచైతన్యకు సంబంధించిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో అది చూసిన చాలామంది జనాలు సమంతని ఇంకా మర్చిపోలేకపోతున్నాడు.

రెండో పెళ్లికి రెడీ అయిన మొదటి భార్య పైన ప్రేమ తగ్గలేదు అంటూ ఇలా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇంతకీ అది ఏంటయ్యా అంటే.. సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య సమంతకి సంబంధించిన ఫోటోలు అన్నీ డిలీట్ చేశారు. ఇక రీసెంట్గా కొన్ని ఫొటోస్ ఉన్నా కూడా వీరి ఎంగేజ్మెంట్ కి ముందు అన్ని ఫొటోస్ డిలీట్ చేసేసి కేవలం మజిలీ సినిమా పోస్టు మాత్రమే తన సోషల్ మీడియా ఖాతాలో ఉంచుకున్నారు. కానీ ఈ పోస్ట్ మాత్రమే కాదు సమంతకు సంబంధించిన ఇంకో పోస్ట్ కూడా ఉంది.

అదేంటంటే నాగచైతన్య సమంత ఇద్దరు కలిసి రేస్ కార్ తో దిగిన ఫోటో ఒకటి ఇంకా చైతు సోషల్ మీడియా ఖాతాలో అలాగే ఉంది. చై సామ్ చెరో పక్క నిల్చొని బ్యాక్ సైడ్ నుంచి తీసిన స్నాప్చాట్ ఫోటో అలాగే ఉంది.ఇక ఈ ఫోటోకి క్యాప్షన్ గా త్రో బ్యాక్ మిస్సెస్ అండ్ ది గర్ల్ అని పోస్ట్ చేశారు. అయితే ఈ ఫోటో డిలీట్ చేయకపోవడంతో నాగచైతన్య ఇంకా సమంత జ్ఞాపకాల్లో ఉన్నారు అంటూ ఈ ఫోటో చూసిన నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.ఇక మరి కొంతమందేమో మరో అమ్మాయితో పెళ్లికి రెడీ అయ్యి సమంతని ఇంకా ఎందుకు మీ ఫోన్ లో ఉంచుకున్నారు డిలీట్ చేసేయండి అని కామెంట్లు పెడుతున్నారు.

https://www.instagram.com/p/Bn-kCY6Ao5f/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

newsline-whatsapp-channel
Tags : newslinetelugu samantha nagachaitanya sobhita-dhulipala majili-movie-

Related Articles