మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.కొద్ది రోజులుగా జనసేన పార్టీ నుంచి…రాజ్యసభ టికెట్ ఇచ్చి.. ఆ తర్వాత…మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి వస్తుందని ప్రచారం చేస్తున్నారు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలో చిరంజీవి పేరు ప్రస్తావన వచ్చింది. నరేంద్రమోదీ ప్రసంగంలో చిరంజీవి పేరు రావడం చాలా సంతోషంగా ఉందంటు చిరు తన ఆనందాన్ని ట్వీట్ చేశారు.
వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ కోసం అడ్వైజరీ బోర్డులో భాగం కావడం సంతోషంగా ఉందని తెలిపారు చిరంజీవి. ప్రధాని మోదీ #WAVES దేశాన్ని ముందుకు నడిపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదంటూ తెలిపారు చిరంజీవి . మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.కొద్ది రోజులుగా జనసేన పార్టీ నుంచి…రాజ్యసభ టికెట్ ఇచ్చి.. ఆ తర్వాత…మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి వస్తుందని ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రధాని మోదీ ప్రసంగంలో చిరంజీవి పేరు ప్రస్తావన వచ్చింది