TANDEL: 'తండేల్ " స్టోరీ రియల్ స్టోరీనా..అసలు కథ ఏంటో తెలుసా !


'తండేల్' అనేది గుజరాతి పదం. తండేల్ అంటే బోట్ నడిపే లీడర్ ..కెప్టెన్ అని అర్ధం. శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.


Published Feb 06, 2025 07:03:00 PM
postImages/2025-02-06/1738848865_tandel.jpg.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ :టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నాగచైతన్య సాయిపల్లవి కాంబినేషన్ లో వస్తున్న మూవీ  తండేల్ . ఫిబ్రవరి 7 న రిలీజ్ అవుతుంది.ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో  రిలీజ్ అవుతుంది. అయితే తండేల్ మూవీ ఎవరి కధ అనేది చాలా తక్కువ మందికే తెలుసు. అసలు రియల్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.


'తండేల్' అనేది గుజరాతి పదం. తండేల్ అంటే బోట్ నడిపే లీడర్ ..కెప్టెన్ అని అర్ధం. శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. వేటకు వెళ్లిన చాలా మత్స్యకారులు గుజరాత్​ పోర్ట్​కి వెళ్లిన సమయంలో సముద్రంలో తెలీక ముందుకు వెళ్తూ  పాకిస్థాన్ సీ వాటర్స్ వెళ్లి అరెస్ట్​ అవుతారు. కాని అక్కడ నుంచి ఎలా విడుదల అయ్యారు. అసలు ఎలా బయటపడ్డారు అనేదే తండేల్ స్టోరీలో తెలుస్తుంది.


గతంలో ఎన్నడూలేని విధంగా డీగ్లామర్‌ లుక్​లో చైతూ, సాయి పల్లవి కనిపించనున్నారు. కేవలం సముద్రం మీదనే 30 రోజుల పాటు షూటింగ్ చేశారు. మంగళూరు సముద్రం దగ్గర ఓ విలేజ్ సెట్ కూడా వేశారు మేకర్స్. పాకిస్థాన్ జైలు ఎపిసోడ్ సుమారు 20 నిమిషాల పాటు ఉంటుందట. అక్కడక్కడా సీన్స్ యాడ్ చేశారట కూడా. ఆన్​లైన్​లో పాకిస్థాన్ గురించి అలాగే అక్కడి జైళ్లు ఎలా ఉంటాయనేది బాగా పరిశీలించి మరీ ఈ సినిమాను తీశారట. ఈ జైలు పెద్ద సెట్ వేశారట. ఈ సినిమాకు దాదాపు 90 కోట్లు భారీ బడ్జెట్ తో ఈ సినిమా చేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్ వర్క్స్ కూడా చాలానే ఉన్నాయట.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagachaitanya tandel saipallavi

Related Articles