వ్యవసాయానికి , ఇండస్ట్రీస్ , గృహ వినియోగం భారీగా పెరగడంతో విద్యుత్ డిమాండ్ 17,000ల మెగావాట్లు అవ్వచ్చని అంచనా.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 15,752 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఏడాది మార్చి కి 15,623 మెగావాట్ల డిమాండ్‌ను అధిగమించినట్లు విద్యుత్‌శాఖ ప్రకటించింది. వ్యవసాయానికి , ఇండస్ట్రీస్ , గృహ వినియోగం భారీగా పెరగడంతో విద్యుత్ డిమాండ్ 17,000ల మెగావాట్లు అవ్వచ్చని అంచనా.
నిజానికి ఈ ఏడాది మరింత వేడి పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల ఫ్యాన్లు, ఏసీలు, కూలర్ల వినియోగం భారీగా పెరిగిపోతుంది. ఇంట్లో అవసరాలకే కరెంట్ వినియోగం దారుణంగా పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో పరిశ్రమల వినియోగం కూడా పెరిగిపోయింది. గత ఏడాది డిసెంబర్ నెలలో 12,666 మెగావాట్లు నమోదు కాగా, ఈ ఏడాది డిసెంబర్ లో 14,375 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌కు చేరుకుంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అదనంగా 10.10శాతం డిమాండ్ పెరిగింది.
ఉత్పత్తి సంస్థల విద్యుత్ యూనిట్‌కు రూ.4.50 ఉన్న సమయంలో రూ.2.72 కే ఎక్స్ఛేంజీల నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా విద్యుత్ సంస్థలు భారీగా ఆదా చేసినట్లు ట్రాన్స్ కో సీఎండీ కృష్ణభాస్కర్ తెలిపారు. తక్కువ ధరకే ఎక్స్ఛేంజీల ద్వారా విద్యుత్ కొనుగోలు చేయడంతో గడిచిన 13 నెలల్లో విద్యుత్ సంస్థలకు వెయ్యికోట్ల రూపాయల వరకు ఆదా అయినట్లు ఆయన పేర్కొన్నారు.