TRAIN: గర్భిణిపై లైంగిక దాడి చేసి రైలు నుంచి తోసేసిన వ్యక్తి !

నాలుగు నెలల గర్భిణితో లైంగిక వేధింపులకు దిగాడు. ఎదురు తిరిగినందుకు నడుస్తున్న రైలు నుంచి బయటకు తోసేశాడు.


Published Feb 07, 2025 04:34:00 PM
postImages/2025-02-07/1738926361_hemaraj.1.3128258.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి తిరుపతికి వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ మహిళల ప్రత్యేక బోగీలోకి ఎక్కిన ఓ వ్యక్తి అమానుషంగా ప్రవర్తించాడు. నాలుగు నెలల గర్భిణితో లైంగిక వేధింపులకు దిగాడు. ఎదురు తిరిగినందుకు నడుస్తున్న రైలు నుంచి బయటకు తోసేశాడు.


తమిళనాడులోని జోలార్ పెట్టై రైల్వేస్టేషన్‌లో కోయంబత్తూరు-తిరుపతి ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌‌లోకి ఓ యువకుడు ఎక్కాడు. అయితే అతడు ఎక్కింది మహిళల ప్రత్యేక బోగీలోకి. "మహిళల బోగీలోకి ఎందుకు ఎక్కావు?" అని సదరు వ్యక్తిని ఓ గర్భిణీ ప్రశ్నించింది. దీనికి సీరియస్ అయిన వ్యక్తి చాలా సేపు ఆమెతో గొడవలకు దిగాడు. 


తర్వాత   ఆ మహిళ బాత్​రూమ్​కు వెళ్లగా వెంబడించాడు. అక్కడ కూడా తన మీద చేతులు వేస్తూ లైంగిక వేధింపులు పాల్పడడంతో .. చివరకు బోగీలోని తలుపు వద్ద నిలబడి గర్భిణీతో మరోసారి వాగ్వాదానికి దిగాడు. సదరు మహిళ అరుస్తున్నా లైంగిక వేధింపులు ఆపలేదు. చివరకు ఆమెను కదులుతున్న రైలు నుంచి బయటకు నెట్టేశాడు. మహిళను తోటి రైలు ప్రయాణికులు ఆ మహిళను రక్షించారు.


వెంటనే అంబులెన్సులో బాధిత మహిళను ప్రాథమిక చికిత్స కోసం కేవీ కుప్పం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం వేలూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి పంపించారు. ఆ గర్భిణిీ కాళ్లు, చేతులకు గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. గర్భిణీ కావడం వల్ల కొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని సూచించారు. దాడి చేసిన వ్యక్తిని హేమరాజ్ గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం హేమరాజ్ తమిళనాడులోని కాట్పాడి రైల్వే పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu train tamilnadu tirupati pregnant

Related Articles