తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారు ఉండరు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి చిరంజీవి ఇంతటి స్థాయికి రావడానికి ఒక డైరెక్టర్ ఉన్నారు. ఆ డైరెక్టర్ వల్ల ఆయన మంచి పోసిషన్ లోకి వెళ్లిపోయారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరయ్యా అంటే కోదండరామిరెడ్డి. అయితే చిరంజీవి ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తను ఇంతటి స్థాయికి రావడానికి సహకరించిన డైరెక్టర్ల పేరు ఎప్పుడు ప్రస్తావిస్తూనే ఉంటారు.
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారు ఉండరు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి చిరంజీవి ఇంతటి స్థాయికి రావడానికి ఒక డైరెక్టర్ ఉన్నారు. ఆ డైరెక్టర్ వల్ల ఆయన మంచి పోసిషన్ లోకి వెళ్లిపోయారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరయ్యా అంటే కోదండరామిరెడ్డి. అయితే చిరంజీవి ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తను ఇంతటి స్థాయికి రావడానికి సహకరించిన డైరెక్టర్ల పేరు ఎప్పుడు ప్రస్తావిస్తూనే ఉంటారు.
తాజాగా ఆ విషయం చెప్పినప్పుడు ఆయన కోదండరామిరెడ్డి పేరు అసలు బయట చెప్పలేదు. ఒక్క సినిమా చేయని డైరెక్టర్ ల గురించి మంచిగా చెప్పినటువంటి చిరంజీవి కోదండరామిరెడ్డి పేరు చెప్పకపోవడంపై మెగా ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. నిజానికి చిరంజీవి ఇంతటి స్థాయికి వచ్చాడు అంటే కోదండరామిరెడ్డి ఒక కారణం అని చెప్పవచ్చు. కోదండరామిరెడ్డి చిరంజీవి కాంబినేషన్ లో రాక్షసుడు, గూండా, దొంగ, విజేత, పసివాడి ప్రాణం, అభిలాష, ఛాలెంజ్, కొండవీటి దొంగ, ముఠామేస్త్రి, 23 సినిమాలు వచ్చాయి.
ఇక చివరగా 1993లో ముఠామేస్త్రి వచ్చింది. ఇప్పటినుంచి వీరిద్దరి కాంబోలో ఒక్క సినిమా రాలేదు. చిరంజీవి ఎదుగుదలలో ఎంతో కృషి చేసిన కోదండరామిరెడ్డి గురించి ఇంటర్వ్యూలో కూడా చిరంజీవి చెప్పుకోకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అలాగని వీరి మధ్య ఏదైనా గొడవ ఉందా అంటే అది కూడా లేదు. ఇదే విషయమై ఒక ఇంటర్వ్యూలో కోదండరామిరెడ్డి మాట్లాడుతూ చిరంజీవికి నాకు ఎలాంటి మనస్పర్ధలు లేవని ఆయన నా పేరు ఎక్కడ ప్రస్తావించకపోయేసరికి చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చారు.