Cm Revanth: స్కిల్ యూనివర్సిటీతో ఉద్యొగ కల్పన

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.


Published Aug 01, 2024 10:56:15 AM
postImages/2024-08-01/1722527741_skill.PNG

న్యూస్ లైన్ డెస్క్: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలన్న గొప్ప ఆశయంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. అభివృద్ధిలో భాగంగా ఇక్కడ మరో నగరాన్ని నిర్మించాలని నిర్ణయించామని, నగరం నిర్మాణం జరగాలంటే, విద్య, వైద్యం, ఉపాధి లాంటి మౌళిక వసతులు కల్పించాలన్నారు. అందుకే శాసనసభలో బిల్లును ఆమోదించి ఇక్కడ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, మోడ్రన్ స్కూల్,  ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ సెంటర్ లకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. ఆనాడు దేశంలో ఎడ్యుకేషన్, ఇరిగేషన్ కు జవహర్ లాల్ నెహ్రూ ప్రాధాన్యతనిచ్చారు. 

స్కిల్ యూనివర్సిటీ ద్వారా లక్షలాది మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ అందించనున్నామని, శిక్షణతో పాటు ఉద్యోగాన్ని ఇచ్చేందుకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయి. స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చిందంటే ఉద్యోగం గ్యారంటీ అన్నారు. మీ భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. ఈ ప్రాంతం ఫ్యూచర్ సిటీగా మారబోతుందని తెలిపారు. న్యూయార్క్ నగరం కంటే అధునాతన నగరాన్ని ఇక్కడ నిర్మించబోతున్నామని, ఇక్కడ హెల్త్ టూరిజం హబ్, స్పోర్ట్స్ హబ్ ను అభివృద్ధి చేస్తామన్నారు. భూమి కోల్పోయిన పేదలకు తను మాట ఇస్తున్నా..  ఎవరూ అధైర్యపడొద్దు మీ భవిష్యత్‌కు భరోసా కల్పిస్తామని తెలిపారు. మీ పిల్లలకు నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడి నుంచి ఎయిర్ పోర్టు వరకు 200 ఫీట్స్ రోడ్డు నిర్మాణం చేస్తామని, మెట్రోను అందుబాటులోకి తీసుకోస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్,  మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.
 

newsline-whatsapp-channel
Tags : telangana congress cm-revanth-reddy university-of-newcastle

Related Articles