ఆమె ఆర్డర్ చేసిన దోసలో వెంట్రుక కనిపించిందని ఆమె తెలిపింది. దాన్ని తీసేసి తిందామని చూడగా.. దోసలో మాడిపోయిన బొద్దింక వచ్చిందని ఆ కస్టమర్ వాపోయారు. హోటల్ యాజమాన్యం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని కస్టమర్లు ప్రశ్నిస్తున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: దోసలో పేడ పురుగు రావడంతో కస్టమర్ అవాక్కయ్యాడు. హైదరాబాద్ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ హైవే మెయిన్ రోడ్డులో ఉన్న శ్రీ రాఘవేంద్ర హోటల్‌లో టిఫిన్ చేసేందుకు వెళ్లినట్లు ఓ కస్టమర్ తెలిపారు. దోస ఆర్డర్ చేయగా అందులో పేడ పురుగు వచ్చిందని కస్టమర్ వెల్లడించారు.
ఇది ఇలా ఉండగా.. మరో మహిళా కస్టమర్‌కు కూడా ఇటువంటి ఘటనే ఎదురవ్వడం గమనార్హం. ఆమె ఆర్డర్ చేసిన దోసలో వెంట్రుక కనిపించిందని ఆమె తెలిపింది. దాన్ని తీసేసి తిందామని చూడగా.. దోసలో మాడిపోయిన బొద్దింక వచ్చిందని ఆ కస్టమర్ వాపోయారు. హోటల్ యాజమాన్యం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని కస్టమర్లు ప్రశ్నిస్తున్నారు. పురుగులు పడ్డ ఆహారం తిని ఫుడ్ పాయిజన్ అయితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆమె అడుగుతున్నారు.