ఇప్పటికే రేవంత్ రెడ్డికి మరో కేసులో నోటీసులు వెళ్లిన విషయం తెలిసిందే. పరువు నష్టం కేసులో సీఎం రేవంత్‌కి బుధవారం కోర్టు నోటీసులు జారీ చేసింది.
న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డికి కోర్టు నోటీసులు వెళ్లాయి. సెప్టెంబర్ 25న విచరణకు హాజరు కావాలని రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. పరువునష్టం కేసులో ఆయనపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని రేవంత్ రెడ్డి ఆధారాలు లేని ఆరోపణలు చేశారని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే, ఈ కేసును త్వరగా విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నాంపల్లి కోర్టు రేవంత్ రెడ్డికి నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే రేవంత్ రెడ్డికి మరో కేసులో నోటీసులు వెళ్లిన విషయం తెలిసిందే. పరువు నష్టం కేసులో సీఎం రేవంత్‌కి బుధవారం కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఖమ్మం జిల్లా వైరా సభలో రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ రేవంత్ తప్పుడు ఆరోపణలు చేశారని బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు.మే 17న మొదటిసారిగా విచారణకు రాగా.. మేజిస్ట్రేట్ మే 22కి వాయిదా వేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు మేజిస్ట్రేట్ మళ్లీ పిటిషన్‌పై విచారణ జరిపి రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఇక ఈ వరుస నోటీసుల పర్వం చూస్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డి మీద చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే ఉంది.