Devara : దేవర రెండో పాట లిరిక్స్.. మీకోసం

రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యానికి అనిరుధ్ సంగీతం జతకలిసి సంగీత ప్రేమికుల మనసులు గెలుచుకుంటున్న ఆ పాట లిరిక్స్ మీకోసం..


Published Aug 05, 2024 06:28:24 PM
postImages/2024-08-05/1722862704_devaralyrics.jpg

న్యూస్ లైన్ డెస్క్ : దూకే దైర్యమ జాగ్రత్తా అంటూ దేవర మాస్ సాంగ్ ఎంతలా ఊపేసిందో మనందరికీ తెలిసిందే. అయితే.. రెండో పాట మాత్రం మనసుకు హత్తుకునేలా మెలోడీ ఉంటుంది అని మూవీ టీమ్ ప్రకటించింది. ఇప్పుడు ఆ పాటను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యానికి అనిరుధ్ సంగీతం జతకలిసి సంగీత ప్రేమికుల మనసులు గెలుచుకుంటున్న ఆ పాట లిరిక్స్ మీకోసం..

పల్లవి :

చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు

ఊరికే ఉండదు కాసేపు

అస్తమానం నీ లోకమే నా మైమరపు

చేతనైతే నువ్వే నన్నాపు

 

రా నా నిద్దర కులాసా.. నీ కలలకిచ్చేశా..

నీ కోసం వయసు వాకిలి కాశా..

రా నా ఆశలు పోగేసా.. నీ గుండెకు అచ్చేశా..

నీ రాకకు రంగం సిద్ధం చేశా..

 

చరణం : 1

ఎందుకు పుటిందో పుట్టింది

ఏమో నువ్వేంటే ముచ్చట పుట్టింది

పుడతానే నీ పిచ్చి పట్టింది

నీ పేరు పెట్టింది వయ్యారం

ఓనీ కట్టింది గోరింట పెట్టింది

సామికి మొక్కులు కట్టింది

 

చరణం : 2

మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి

హత్తుకోలేవా మరి సరస చేరి

వాస్తుగా పెంచానిట్టా వందకోట్ల సొగసరి

ఆస్తిగా అల్లేసుకో కొసరి కొసరి

 

చెయ్యరా ముద్దుల దాడి

ఇష్టమేలే నీ సందడి

ముట్టడించి ముట్టేసుకోలేవ

ఓసారా చెయ్యి జారి

రా ఏ బంగరు నక్లీసు.. నా ఒంటికి నచ్చట్లే

నీ కౌగిలితో నను సింగారించు

రా ఏ వెన్నెల జోలాలి నను నిద్దర పుచ్చట్లే

నా  తిప్పలు కొంచెం ఆలోచించు

 

ఎందుకు పుట్టిందో పుట్టింది

ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది

పుడతానే నీ పిచ్చి పట్టింది

నీ పేరు పెట్టింది యవ్వారం

ఓనీ కట్టింది గోరింట పెట్టింది

సామికి మొక్కులు కట్టింది

newsline-whatsapp-channel
Tags : jr-ntr sr-ntr movies movie-news latest-news news-updates cinema-news filmfare

Related Articles