Kajal: కాజల్ ఆ హీరో ని నిజంగా ప్రేమించిందా..?

టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ పేరు చెప్పగానే ఎంతోమంది అభిమానులు ఎగ్జైట్ ఫీల్ అవుతారు. అయితే ఈమె మొదటి రెండు సినిమాలతోనే హిట్టు కొట్టి టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ సంపాదించింది.అలా వరుస సినిమాలు చేసి 


Published Aug 01, 2024 10:47:36 PM
postImages/2024-08-01/1722528747_kajal.jpg

న్యూస్ లైన్ డెస్క్: టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ పేరు చెప్పగానే ఎంతోమంది అభిమానులు ఎగ్జైట్ ఫీల్ అవుతారు. అయితే ఈమె మొదటి రెండు సినిమాలతోనే హిట్టు కొట్టి టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ సంపాదించింది.అలా వరుస సినిమాలు చేసి ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ వంటి యంగ్ హీరోలతో పాటు చిరంజీవి,బాలకృష్ణ, కమల్ హాసన్ వంటి సీనియర్ హీరోలతో కూడా నటించింది.

అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ నిజంగానే ఆ హీరోతో ప్రేమలో పడిందా.. ప్రేమ ఒక్కటేనా పెళ్లి కూడా చేసుకోవాలనుకుందా అనేది ఇప్పుడు చూద్దాం.. టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లూని ప్రేమించి పెళ్లి చేసుకుంది.కానీ గౌతమ్ కిచ్లూ ని ప్రేమిస్తున్న విషయం ఆమె చెప్పే వరకు కూడా ఎవరికి తెలియదు.అంతే కాదు పెళ్లి కూడా కరోనా సమయంలో రహస్యంగా చేసుకొని ఆ తర్వాత ఈ విషయాన్ని బయటపెట్టింది.

అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరో హీరోయిన్లపై ప్రేమ వార్తలు, డేటింగ్ వార్తలు రావడం చాలా కామన్. ఇక గతంలో కాజల్ అగర్వాల్ కూడా ఓ హీరోతో ప్రేమలో ఉండి డేటింగ్ చేసిందని వార్త టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల్లో జోరుగా వినిపించింది.ఇక ఆ హీరో ఎవరో కాదు దగ్గుబాటి రానా.. కాజల్ దగ్గుబాటి రానా తో కలిసి నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాలో చేసింది. అయితే ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే కాజల్ రానా తో డేటింగ్ చేస్తుందనే పుకారు టాలీవుడ్ లో గట్టిగా వినిపించింది.

అంతేకాదు రానాని పెళ్లి చేసుకుంటానని కాజల్ తండ్రిని అడిగితే తండ్రి కాజల్ కి వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి ఇలాంటి ప్రేమ, పెళ్లి అని మాట్లాడితే సినిమాలు మాన్పించి ఇంటి దగ్గర కూర్చోబెడతాను అని బెదిరించాడనే టాక్ కూడా వినిపించింది. కానీ ఇందులో వాస్తవం లేదు.ఎందుకంటే కాజల్ భర్తతో పెళ్లికి ముందే దాదాపు పది సంవత్సరాలు గౌతమ్ కిచ్లూతో ప్రేమలో ఉంది. ఇది కేవలం టాలీవుడ్ లో వినిపించిన గాసిప్ మాత్రమే అని అర్థం చేసుకోవచ్చు.

newsline-whatsapp-channel
Tags : kajal-aggarwal gautham-kichlu newslinetelugu rana nene-raju-nene-mantri

Related Articles