పట్టణీకరణ కారణంగా పిచ్చుకలు కనిపించడం లేదని ...అవి అంతరించిపోతున్నా చెప్పలేమని అన్నారు.. తిరిగి వాటి జనాభాను పెంచాల్సిన అవసరం చాలా ఉందని మోదీ గుర్తు చేశారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఈ రోజు మన్ కీ బాత్ లో ప్రధాన మోదీ 116 వ ఎపిసోడ్ లో ఇంట్రస్టింగ్ టాపిక్స్ మాట్లాడారు. జీవ వైవిధ్య నిర్వాహణలో కీలకపాత్ర పోషించే పిచ్చుకల కనుమరుగు అయిపోతున్న పిచ్చుకల గురించి ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణీకరణ కారణంగా పిచ్చుకలు కనిపించడం లేదని ...అవి అంతరించిపోతున్నా చెప్పలేమని అన్నారు.. తిరిగి వాటి జనాభాను పెంచాల్సిన అవసరం చాలా ఉందని మోదీ గుర్తు చేశారు.
చెన్నైలోని కుడుగల్ ట్రస్ట్ పిచ్చుకల జనాభా పెంపు కోసం చేస్తున్న కృషిని ప్రధాని ప్రశంసించారు. ఈ ట్రస్ట్ వారు పిచ్చుకల జనాభా పెంచే ప్రయత్నంలో పాఠశాల పిల్లలను కూడా భాగస్వాములను చేయడం ప్రశంసనీయం అన్నారు. రోజు వారీ జీవితంలో పిచ్చుల ప్రాముఖ్యాన్ని గురించి కుడుగల్ ట్రస్ట్ వారు పిల్లలకు వివరిస్తున్నారు ఇది చాలా మంచి విషయమని తెలిపారు.
అసలు ఈ తరం పిల్లలకు చాలా మందికి పిచ్చుకలను ప్రత్యక్షంగా చూసిన అనుభవం కూడా లేదు. మరికొంతమంది చిన్నారులకు అయితే పిచ్చుకలు గురంచి తెలీదు కూడా. వీడియ, ఫొటోల్లో మాత్రమే వాటిని చూపించాల్సి వస్తుందని మోదీ తెలిపారు. అలాంటి పిల్లలు , పిచ్చుకలను ప్రత్యక్షంగా చూసి వాటి అరుపులతో తెల్లవారే రోజులు రావాలంటూ ప్రధాని మోదీ కోరుకున్నారు.