సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు దారుణంగా రావడంతో రెహ్మాన్ భార్య సైరాభాను రెస్పాండ్ అయ్యారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఏ ఆర్ రెహ్మాన్ గురించి రీసెంట్ గా వైరల్ అవుతున్న వార్త రెహ్మాన్ విడాకుల వార్త. అయితే తన అసిస్టెంట్ కూడా సేమ్ టైంలో విడాకులు ప్రకటించడంతో అందరు ఏ ఆర్ రెహ్మాన్ తో ఏదో ఉందని వార్తలు వైరల్ చేశారు. కాని వాటిపై ఏ ఆర్ రెహ్మాన్ తో పాటు మోహినీ డెన్ కూడా రియాక్ట్ అయ్యారు. మా విడాకులకు వాళ్ల విడాకులకు లింక్ లేదని క్లారిటీ ఇచ్చారు.అయినా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు దారుణంగా రావడంతో రెహ్మాన్ భార్య సైరాభాను రెస్పాండ్ అయ్యారు.
రెహమాన్ బంగారం లాంటి వ్యక్తి అని, ఆయననేమీ అనొద్దని విజ్ఞప్తి చేశారు. గత కొన్ని నెలలుగా తాను ఆరోగ్యంగా లేనని, అందుకే రెహమాన్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. ఇప్పుడు తన పరిస్థితి బాలేదని ..ట్రీట్మెంట్ కోసం ముంబై వచ్చామని తెలిపారు. అంతేకాదు ...రెహమాన్ నుంచి విడాకులు కూడా తన ఇష్టపూర్వకంగా తీసుకున్నానని దయచేసి ఇబ్బంది పెట్టవద్దని తెలిపారు.దయచేసి రెహమాన్ గురించి చెడుగా ప్రచారం చేయవద్దు. నా అనారోగ్యం వల్లే చెన్నై నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.
నా విడాకులు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాయో ..బాధపెట్టాయో మాకు తెలుసు . మీరు ఎందుకు దీన్ని ఇంతపెద్ద రచ్చ చేస్తున్నారంటూ వాయిస్ నోట్ తెలిపారు. అతడ్ని ఎంతగా ప్రేమించానో చెప్పడానికి ఇదే నిదర్శనం. అతడు కూడా నన్ను అలాగే ప్రేమించాడు. తన జీవితాన్ని రోడ్డున పెట్టొద్దంటు తెలిపారు.