రెసిడెన్షియల్ స్కూళ్లలో సదుపాయాల కోసం భారీగా ఖర్చు చేస్తున్నామని అన్నారు. నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కృషి చేస్తున్నామని తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: విద్యార్థుల ఉద్యమం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. రెసిడెన్షియల్ స్కూళ్లలో సదుపాయాల కోసం భారీగా ఖర్చు చేస్తున్నామని అన్నారు. నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కృషి చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రం నుంచి అత్యధికంగా సివిల్ సర్వెంట్లు రావాలని ఆశిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో మరో 35 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయనున్నామని ఆయన అన్నారు. సివిల్స్ ఉత్తీర్ణులై రాష్ట్ర ప్రతిష్టను పెంచాలని ఆయన అన్నారు. 2028 ఒలింపిక్స్‌లో అత్యధిక మెడల్స్ తెలంగాణ యువత సాధించాలని, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పుతున్నామని ఆయన వెల్లడించారు.