Tirumala: తిరుమలేశుడికి ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తారో తెలుసా.?

కలియుగ పురుషుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి ఒక్కరికి భక్తి భావం పొంగిపొర్లుతుంది. ఈ స్వామి వారిని నిష్టతో పూజిస్తే ఎలాంటి కోరికైనా నెరవేరుస్తాడు. అందుకే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి 


Published Sep 22, 2024 07:23:58 AM
postImages/2024-09-22/1726970038_tirumala.jpg

న్యూస్ లైన్ డెస్క్: కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి ఒక్కరికి భక్తి భావం పొంగిపొర్లుతుంది. ఈ స్వామి వారిని నిష్టతో పూజిస్తే ఎలాంటి కోరికైనా నెరవేరుస్తాడు. అందుకే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వస్తుంటారు.

అలాంటి స్వామి వారికి ప్రతిరోజు ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తారు.. మనం ఎలాంటి నైవేద్యాలు పెడితే స్వామి వారు మన కోరికలు తీరుస్తారో తెలుసుకుందాం.. భక్తుల కొంగు బంగారం అయినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆహార ప్రియుడట. వెంకటేశ్వర స్వామికి లడ్డుతోపాటు రకరకాల ఆహార పదార్థాలను నైవేద్యంగా పెడుతూ ఉంటారట.  

ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తిరుపతి లడ్డు,  వడ,  అప్పాలు, సమర్పిస్తారని చాలామందికి తెలుసు. కానీ స్వామి వారికి ఇవే కాకుండా మురుకు, జిలేబి, దోష, పోలీలను, కూడా  నైవేద్యంగా సమర్పిస్తారట.  పూర్వకాలం నుంచి ఈ నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందట.  

అయితే వీటిని శ్రీ భగవత్ రామానుజాచార్యులు నిర్దేశించిన నియమాల ప్రకారం పూజలు చేసి నైవేద్యంగా ప్రసాదాలు సమర్పిస్తారని  అంటున్నారు వేద పండితులు.

newsline-whatsapp-channel
Tags : news-line tirumala tirumala-prasadalu tirumala-laddu vada

Related Articles