దేశంలోని సంపన్న కుటుంబాల్లో ఒకడైనటువంటి ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఆయన రెండవ కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ పెళ్లి జూలై 12న అంగరంగ వైభవంగా జరగనుంది. ఇదే తరుణంలో ఈ పెళ్లికి సంబంధించి ఫ్రీ వెడ్డింగ్ వేడుక చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు.. దీంతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోని ప్రముఖులు అందరికీ పెళ్లి ఆహ్వానం అందింది. ఈ తరుణంలో అనంత్ మరియు రాధిక మర్చంట్లకు సంబంధించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి.
న్యూస్ లైన్ డెస్క్: దేశంలోని సంపన్న కుటుంబాల్లో ఒకడైనటువంటి ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఆయన రెండవ కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ పెళ్లి జూలై 12న అంగరంగ వైభవంగా జరగనుంది. ఇదే తరుణంలో ఈ పెళ్లికి సంబంధించి ఫ్రీ వెడ్డింగ్ వేడుక చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు.. దీంతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోని ప్రముఖులు అందరికీ పెళ్లి ఆహ్వానం అందింది. ఈ తరుణంలో అనంత్ మరియు రాధిక మర్చంట్లకు సంబంధించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి.
ఇదే తరుణంలో అనంత్ అంబానీ రాధిక ఎంత చదువుకున్నారని దానిపై ఇప్పుడు తెలుసుకుందాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అయినటువంటి ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ స్కూల్ విద్యను ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివారట. ఆ తర్వాత యుఎస్ఏ లోని రోడ్డు ఐలాండ్ లో ఉన్నటువంటి బ్రౌన్ విశ్వవిద్యాలయం నుంచి బిజినెస్ మేనేజ్మెంట్ లో బ్యాచిలర్ డిగ్రీ చేశారట.
ప్రస్తుతం ఆయన రిలయన్స్ న్యూ ఎనర్జీకి సారథ్యం వహిస్తున్నారు. అలాగే తాను పెళ్లి చేసుకోబోయే రాధిక మర్చంట్ పాఠశాల విద్యను కేతడ్రాల్ అండ్ జాన్ కానన్ పాఠశాలలో చదివిందట. ఆ తర్వాత 2006 నుంచి 2009 వరకు ఏ కోల్ మొండియేల్ వరల్డ్ స్కూల్లో పూర్తి చేసిందట. ఆ తర్వాత 2009 నుంచి 2013 ముంబై లోని బీడీ సోమాలి ఇంటర్నేషనల్ స్కూల్లో మరింత చదివిందట. తర్వాత న్యూయార్క్ లోని యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిందట. ప్రస్తుతం కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేస్తోంది.