Heroine: ఈ ఫోటోలో ఉన్న పాపని గుర్తుపట్టారా.. కుర్రాళ్ల కలల రాణి..?

ఈ మధ్యకాలంలో చాలామంది సెలెబ్రెటీలకు సంబంధించి చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కొంతమంది సెలబ్రిటీలు వాళ్ల చిన్ననాటి ఫోటోలను అభిమాలతో పంచుకుంటున్నారు.


Published Aug 06, 2024 10:08:11 AM
postImages/2024-08-06/1722919091_anupamaparameswaran.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో చాలామంది సెలెబ్రెటీలకు సంబంధించి చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కొంతమంది సెలబ్రిటీలు వాళ్ల చిన్ననాటి ఫోటోలను అభిమాలతో పంచుకుంటున్నారు. మరికొంతమంది అభిమానులేమో తమ అభిమాన నటీనటులకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలను వెతికి మరీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఈ ఫోటోలో ఉన్న పాప ఎవరో గుర్తుపట్టారా..

ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ హీరోయిన్.. గ్లామర్ హీరోయిన్..అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే తాజాగా పైన కనిపిస్తున్న ఫోటోలో ఉన్న క్యూట్ బేబీ కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్.. ఒకప్పుడు అంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో గ్లామర్ పాత్రలకు ఆమడ దూరంలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో బోల్డ్ పాత్రలు చేస్తూ రెచ్చిపోతుంది. ఇక ఇప్పటికే ఆ హీరోయిన్ ఎవరో మీకు గుర్తచ్చి ఉంటుంది. అదేనండి ఆమెనే అనుపమ పరమేశ్వరన్..

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో లంగా వోణీలు కట్టుకొని చుడీదార్లు వేసుకొని ఎంతో సాంప్రదాయబద్ధంగా ఉండే అనుపమ పరమేశ్వరన్ ఒక్కసారిగా లిప్ లాక్ సీన్స్ తో బోల్డ్ రొమాన్స్ తో తన అభిమానులకు షాక్ ఇచ్చింది. రౌడీ బాయ్స్, టిల్లు స్క్వేర్ సినిమాలతో అనుపమ తనలో ఉన్న మరో యాంగిల్ ని బయటపెట్టింది. అప్పటివరకు ఈ హీరోయిన్ ని సాంప్రదాయ బద్ధంగా చూసిన చాలామంది ఈమె అభిమానులు ఒక్కసారిగా ఈమె బోల్డ్ లుక్ లో కనిపించేసరికి షాక్ అయిపోయారు.

అంతేకాదు ఈ విషయం గురించి ఆమె అభిమానులు బాధపడడం ఇష్టం లేక ఎప్పుడూ అలాంటి పాత్రలే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి పాత్రలు కూడా చేస్తేనే గుర్తింపు ఉంటుంది.రొటీన్ గా ఉండకుండా ఇలా వెరైటీగా ట్రై చేశాను అంటూ తన అభిమానులకు చెప్పింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించి చిన్ననాటి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫొటోస్ చూసిన ఆమె అభిమానులు అనుపమ చిన్నప్పుడు ఎలా ఉందో పెద్దయ్యాక కూడా అంతే గ్లామర్, క్యూట్ గా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు

newsline-whatsapp-channel
Tags : newslinetelugu tollywood anupama-parameswaran tillu-2 baby

Related Articles