Pawankalyan:'బంగారం' మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఇప్పుడు చూస్తే.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బంగారం చిత్రం అంటే తెలియని వారు ఉండరు. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. పవన్ సరసన మీరా చోప్రా నటించింది.  అలాంటి ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినటువంటి చిన్నారి చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఈమె తన నటనతో అద్భుతంగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. అలాంటి ఈ చిన్నారి పేరు ననుషా సంతోష్.ప్రస్తుతం ఈ చైల్డ్ ఆర్టిస్ట్  పెద్ద అమ్మాయిగా మారిపోయింది.  దాదాపు తెలుగు, మలయాళ ఇండస్ట్రీలలో 20కి పైగా సినిమాల్లో నటించింది.  అంతేకాకుండా 2012లో 'మిస్టర్ మురుగన్'  అనే మూవీలో  హీరోయిన్ గా కూడా చేసింది.


Published Jul 23, 2024 02:22:01 AM
postImages/2024-07-23/1721716475_ppawan.jpg

న్యూస్ లైన్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బంగారం చిత్రం అంటే తెలియని వారు ఉండరు. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. పవన్ సరసన మీరా చోప్రా నటించింది.  అలాంటి ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినటువంటి చిన్నారి చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఈమె తన నటనతో అద్భుతంగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. అలాంటి ఈ చిన్నారి పేరు ననుషా సంతోష్.

ప్రస్తుతం ఈ చైల్డ్ ఆర్టిస్ట్  పెద్ద అమ్మాయిగా మారిపోయింది.  దాదాపు తెలుగు, మలయాళ ఇండస్ట్రీలలో 20కి పైగా సినిమాల్లో నటించింది.  అంతేకాకుండా 2012లో 'మిస్టర్ మురుగన్'  అనే మూవీలో  హీరోయిన్ గా కూడా చేసింది. అలాగే జీనియస్, రేణిగుంట అనే సినిమాల్లో కూడా నటించింది. ఈ ముద్దుగుమ్మ చివరగా నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చినటువంటి జెర్సీ, చిత్రంలో చిన్న పాత్రలో చేసి ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది.

పై చదువులకై స్కాట్లాండ్ వెళ్ళిపోయింది. అక్కడ ఎడిన్ బార్గ్ విశ్వవిద్యాలయంలో గ్లోబల్ మెంటల్  హెల్త్ అండ్ సొసైటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసి లేటెస్ట్ గా ఆమె ఆ డిగ్రీ పట్టా పొందింది.  దానికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. ఇదిచూసిన చాలామంది బంగారం మూవీలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఇంత పెద్దగా అయిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేను ఈ పట్టా పొందడం కోసం ఎంతో కష్టపడ్డాను, నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. పార్ట్ టైం, ఫుల్ టైం జాబ్స్ చేశానని చెప్పుకొచ్చింది. ప్రతి దాంట్లో నా కుటుంబ సభ్యులు నాకు సపోర్టుగా నిలిచారు. చివరికి నేను అనుకున్నది సాధించానని అన్నది. ప్రస్తుతం  ననుష ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu pawan-kalyan nani bangaram-movie sanusha-santhosh jersy-movie

Related Articles