మెగాస్టార్ పున్నమినాగు హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు చూస్తే షాకే.?

తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫేమస్ నటులలో చిరంజీవి కూడా ఒకరు. ఆయన కేవలం దేశంలోని ఎంతోమంది హీరోయిన్లతో తెరను పంచుకున్నారు. ఇలాంటి చిరంజీవితో పున్నమినాగు సినిమాలో నటించినటువంటి హీరోయిన్ చాలామందికి గుర్తుండి ఉంటుంది. ఆ టైంలో  తన కైపెక్కిచ్చే కళ్ళతో కుర్రకారు మదిని దోచేసింది.  అప్పట్లో ఆ హీరోయిన్ అంటే కుర్రకారు పడి చచ్చేవారట.  తన అంద చందాలతో ఎంతో మెస్మరైజ్ చేసినటువంటి హీరోయిన్ రతి అగ్నిహోత్రి.


Published Jul 09, 2024 04:32:43 AM
postImages/2024-07-09/1720507662_rathi.jpg

న్యూస్ లైన్ డెస్క్:తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫేమస్ నటులలో చిరంజీవి కూడా ఒకరు. ఆయన కేవలం దేశంలోని ఎంతోమంది హీరోయిన్లతో తెరను పంచుకున్నారు. ఇలాంటి చిరంజీవితో పున్నమినాగు సినిమాలో నటించినటువంటి హీరోయిన్ చాలామందికి గుర్తుండి ఉంటుంది. ఆ టైంలో  తన కైపెక్కిచ్చే కళ్ళతో కుర్రకారు మదిని దోచేసింది.  అప్పట్లో ఆ హీరోయిన్ అంటే కుర్రకారు పడి చచ్చేవారట.  తన అంద చందాలతో ఎంతో మెస్మరైజ్ చేసినటువంటి హీరోయిన్ రతి అగ్నిహోత్రి.

80వ దశకంలో ఈమె ఒక స్టార్ హీరోయిన్. కేవలం తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లో కూడా చాలామంది హీరోయిన్లతో తెరను పంచుకుంది. కమలహాసన్, రజనీకాంత్, వంటి స్టార్ హీరోలతో కూడా నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది. అలాంటి అగ్నిహోత్రి డైరెక్టర్ భారతి రాజా డైరెక్షన్ లో  వచ్చినటువంటి పూతీయా వర్పీస్  అనే చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది.

ఈ సినిమా తర్వాత  "పీర్ణం మారిన పూలు"  అనే చిత్రం ద్వారా ఎంతో ఫేమస్ అయింది.  కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ పక్కన కలుగు, మురట్టుకలై, ఉల్లాస పరవేస్,  వంటి చిత్రాలలో నటించి స్టార్ హీరో స్టేటస్ తెచ్చుకుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా హిందీ చిత్రాల్లో కూడా నటించింది. ఈ విధంగా దక్షిణాదిలో ఒక ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ చిరంజీవితో పున్నమినాగు చిత్రంలో చేసి సూపర్ హిట్ అందుకుంది.

అప్పట్లో వీరి జోడి  బాగుంది అనే కామెంట్స్ కూడా వచ్చాయి. కేవలం సినిమాలోనే కాకుండా ఈమె సీరియల్స్ లో కూడా నటించింది.   అగ్నిహోత్రి 1985లో బిజినెస్ మ్యాన్ అయినటువంటి అనిల్ విర్వాణిని  పెళ్లి చేసుకుంది.  చాలా రోజుల తర్వాత తన కొడుకుతో కలిసి సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేయడంతో ఆమెను అప్పట్లో చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ఎన్నో అంద చందాలు కలిగినటువంటి హీరోయిన్ ఇలా తయారయింది ఏంటి అంటూ షాక్ అయిపోతున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rati Agnihotri (@ratiagnihotri10)

newsline-whatsapp-channel
Tags : chiranjeevi rajinikanth kamal-haasan punnaminagu rathi-agnihotri

Related Articles