Double ismart: డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్.. డైలాగ్స్ వింటే గూస్ బంప్స్.!

 పూరి జగన్నాథ్,రామ్ పోతినేని కాంబినేషన్లో  వస్తున్న మూవీ డబుల్ ఇస్మార్ట్. ఈ మూవీని చార్మి మరియు పూరి జగన్నాథ్  కలిసి నిర్మిస్తున్నారు. అలాంటి ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తుండగా సంజయ్ దత్ విలన్


Published Aug 04, 2024 09:14:14 PM
postImages/2024-08-04/1722786254_Doubleismart.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి యంగ్ హీరోలలో రామ్ పోతినేని కూడా ఒకరు. ఈయన హిట్స్ ప్లాప్స్ అనే సంబంధం లేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అలాంటి రామ్ పోతినేని నుంచి వచ్చినటువంటి  మూవీ ఇస్మార్ట్ శంకర్. చాలా డిఫరెంట్ కథతో డిఫరెంట్ లుక్ లో రామ్ కనిపించారు.  ఈ సినిమా 2019లో రిలీజ్ అయ్యి అద్భుతమైన హిట్ సాధించింది.

దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ పేరుతో మరో చిత్రం కూడా రాబోతున్నది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.  పూరి జగన్నాథ్,రామ్ పోతినేని కాంబినేషన్లో  వస్తున్న మూవీ డబుల్ ఇస్మార్ట్. ఈ మూవీని చార్మి మరియు పూరి జగన్నాథ్  కలిసి నిర్మిస్తున్నారు. అలాంటి ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తుండగా సంజయ్ దత్ విలన్ గా కనిపించబోతున్నారు.  

ఆగస్టు 15వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదైలయినటువంటి అప్డేట్స్ భారీ అంచనాలను పెంచాయి. తాజాగా డబుల్ ఇస్మార్ట్ నుంచి ట్రైలర్ కూడా విడుదల చేశారు మూవీ యూనిట్. ఇందులో రామ్ పోతినేని యాక్టింగ్, డైలాగ్స్ చూస్తే మాత్రం  గూస్ బంప్స్ పుడతాయి.

అంతేకాకుండా ఈ చిత్రంలో కమెడియన్ ఆలీ,రోహిణి కామెడీ  మరింత ఆకట్టుకోబోతోందట. రామ్ పోతినేని హీరోయిన్స్ తో  చెప్పే డైలాగ్స్ చాలామందిని ఆకట్టుకుంటాయని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. మొత్తానికి ఈ చిత్ర టైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది.

https://youtu.be/ym0upoayqJg?si=rFnjljJqMX95WG9q

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu puri-jagannadh double-ismart-tariler ali ismart-shankar

Related Articles