ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్' థియేటర్లలో విడుదలైంది. ఆల్రెడీ ప్రీమియర్ షోలు పడ్డాయి. సోషల్ మీడియా టాక్ అద్దిరిపోయింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: పూరీ జగన్నాథ్ కు పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ తగిలింది.'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్' థియేటర్లలో విడుదలైంది. ఆల్రెడీ ప్రీమియర్ షోలు పడ్డాయి. సోషల్ మీడియా టాక్ అద్దిరిపోయింది.
'స్కంద' ఏవరేజ్ టాక్ ...రామ్ కాస్త డౌన్ అవుతున్న టైంలో ఇస్మార్ట్ భలే తగిలింది. ఇక పూరీ లైగర్ ...భారీ లెవెల్ డిజాస్టర్ ...తర్వాత హీరో ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) కలిసి చేసిన ఫిల్మ్ ఇది. అటు హీరో, ఇటు డైరెక్టర్ ఫ్లాపుల్లో ఉన్నా ఇంత బజ్ రావడానికి కారణం 'ఇస్మార్ట్ శంకర్' విజయం. ఇద్దరికి సినిమా సూపర్ బూస్ట్. డబుల్ ఇస్మార్ట్ మాజ్ ఆడియన్స్ కు కరెక్ట్్ కిక్కు ఇస్తుంది. ఆల్రెడీ అమెరికాలో ప్రీమియర్లు పడ్డాయి.
''పక్కా హిట్ అనుకున్న 'మిస్టర్ బచ్చన్' ఫ్లాప్ అయ్యింది ...పూరీ సీన్ అయిపోయింది...మరో రాడ్ సినిమా తీస్తున్నాడు అనుకుంటే ...సూపర్ డూపర్ ఉందంటున్నారు. డబుల్ ఇస్మార్ట్ సూపర్ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు . అమెరికాలో 'డబుల్ ఇస్మార్ట్' ప్రీమియర్స్ కంటే ఏపీ, తెలంగాణలో 'మిస్టర్ బచ్చన్' పెయిడ్ ప్రీమియర్ షోలు పడ్డాయి. డబుల్ ఇస్మార్ట్ కంటే ..ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మిస్టర్ బచ్చన్ టాక్ చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అయిపోతుంది.
రామ్ పోతినేని ఎనర్జీ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అసలు దాంతో 'రామ్ అంటే ఎనర్జీ... ఎనర్జీ అంటే రామ్' అని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి శంకర్ క్యారక్టర్లో చూసినా కొత్తగా చూసినట్టు ...మాస్ మెంటల్ క్యారక్టర్ లో కనిపించారు. ఫస్టాఫ్ కంప్లీట్ అయ్యే సరికి సినిమాకు పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. పూరి డైరెక్షన్ స్కిల్స్ కూడా డిస్కషన్ పాయింట్ అయ్యాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ మాంచి సాంగ్స్ ఇచ్చారని, స్క్రీన్ మీద సైతం ఆ సాంగ్స్ అదిరిపోయాయని టాక్. 'మార్ ముంత చోడ్ చింత' పాటలో రామ్ తన స్టెప్పులతో అదరగొట్టేశారట. సంజయ్ దత్ విలనిజం అయితే చింపిపడేసిందంతే..అంటున్నారు. అసలు పూరీ కి ఫ్లాప్ పడితే ...ఏ రేంజ్ హిట్టు ఇవ్వాలో బాగా తెలుసంటున్నారు నెటిజన్లు.