రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
న్యూస్ లైన్ డెస్క్: రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు సీఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. తెలంగాణ సహా హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపురలో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనుండగా.. అసోం, బిహార్, మహారాష్ట్రలో రెండేసి స్థానాలకు ఎన్నిక జరగనున్నాయి. తెలంగాణలో ఒక స్థానానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవలే రాజ్యసభ సభ్యత్వానికి కే. కేశవరావు రాజీనామా చేశారు.
బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా, ఆయన రాజీనామా చేయడంతో రాజ్యసభ సీటు ఖాళీ అయింది. ఈ నెల 14 నుంచి 21 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియా జరగనుంది. సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్.. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ జరుగుతాయి.