ముద్దుగా ఉన్నా ఈ చిన్నారి.. ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నారు.  కానీ ఇందులో అతి చిన్న వయసు హీరోయిన్ అంటే కృతి శెట్టి మాత్రమే. అలాంటి కృతి శెట్టి  ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్దికాలంలోనే  స్టార్ హీరోయిన్ స్టాటస్ పొందింది. అలాంటి ఈమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.  అలాంటి ఈ లేత ముద్దుగుమ్మ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కృతి శెట్టి  బుచ్చిబాబు డైరెక్షన్ లో వైష్ణవ తేజ్ హీరోగా  వచ్చినటువంటి ఉప్పెన చిత్రం ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.


Published Jul 04, 2024 02:59:14 AM
postImages/2024-07-04/1720076274_kri.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నారు.  కానీ ఇందులో అతి చిన్న వయసు హీరోయిన్ అంటే కృతి శెట్టి మాత్రమే. అలాంటి కృతి శెట్టి  ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్దికాలంలోనే  స్టార్ హీరోయిన్ స్టాటస్ పొందింది. అలాంటి ఈమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.  అలాంటి ఈ లేత ముద్దుగుమ్మ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కృతి శెట్టి  బుచ్చిబాబు డైరెక్షన్ లో వైష్ణవ తేజ్ హీరోగా  వచ్చినటువంటి ఉప్పెన చిత్రం ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

డిఫరెంట్ కథ నేపథ్యంతో  వచ్చినటువంటి ఈ సినిమా  అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో కృతిశెట్టి నటన అందరినీ హత్తుకుంది.  ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ లోనే కృతి శెట్టి  స్టార్ హీరోయిన్ కు ఉన్నంత పేరు సంపాదించుకుంది.  ఇక ఆ క్రేజ్ అలాగే కొనసాగిస్తూ వస్తోంది. ఈ చిత్రం తర్వాత ఆమెకు నాని సరసాన నటించే అవకాశం వచ్చింది. నానితో శ్యాం సింగరాయ్ చిత్రంలో నటించింది. చిత్రం కూడా సూపర్ హిట్ కావడంతో  ఇక బేబమ్మ పేరు ఎక్కడికో వెళ్లిపోయింది.

ఆ తర్వాత రామ్ పోతినేని హీరోగా వచ్చినటువంటి ప్రాజెక్టులో కూడా  హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఆ సినిమా పేరు ది వారియర్.. కానీ ఈ చిత్రం అనుకున్నంత హిట్ మాత్రం సాధించలేదు. ఇదే చిత్రం కాకుండా రామ్ పోతినేనితో రెడ్ సినిమాలో కూడా చేసింది. తెలుగులోనే కాకుండా పలు  తమిళ చిత్రాల్లో కూడా నటిస్తూ వస్తున్నటువంటి కృతి శెట్టి  బంగార్రాజు అనే చిత్రంలో కూడా  నటించి తన నటన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది.

ఈ విధంగా అనేక చిత్రాలలో నటిస్తూ దూసుకు వస్తున్నటువంటి ఈ బ్యూటీ చివరగా మనమే అనే చిత్రంలో నటించింది.  ఇందులో శర్వానంద్ హీరోగా చేశారు. విధంగా హిట్లు ఫ్లాపులు అనే తేడా లేకుండా దూసుకుపోతోంది. ఈ బ్యూటీ చిన్ననాటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని మరియు ఇప్పుడున్న కృతిశెట్టిని చూస్తే  చాలామంది షాక్ అవుతారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu kruthishetty uppena buchibabu vaishnav-tej

Related Articles