devara: ఏంటి దేవరా సాంగ్ ...యమదొంగ ట్యూనా ..ఇలా దొరికిపోయారేంటబ్బా !

ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో సాంగ్‌ను యాడ్ చేసి మిక్స్ చేశారు. ట్యూన్ పక్కాగా దేవర కోసమే చేసినట్లుండడం తో నెట్టింట తెగ వైరల్ అయిపోతుంది.


Published Aug 08, 2024 08:29:00 AM
postImages/2024-08-08/1723086084_ntr.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఎన్టీఆర్ , జాన్వీకపూర్ జంటగా రిలీజ్ అవుతున్న దేవర సాంగ్ సూపర్ ట్రెండ్ లో ఉంది. అన్ని బాషల్లోను మిలియన్ వ్యూస్ సూపర్ ఫాస్ట్ లో దూసుకుపోతుంది. చుట్టమల్లే అంటూ సాగే ఈ పాటకి ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ పాటలో వీడియోకి ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో సాంగ్‌ను యాడ్ చేసి మిక్స్ చేశారు. ట్యూన్ పక్కాగా దేవర కోసమే చేసినట్లుండడం తో నెట్టింట తెగ వైరల్ అయిపోతుంది.


కొరటాల శివ దర్శకత్వంలో జూ ఎన్టీఆర్ చేస్తున్న 'దేవర' సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టూ పార్ట్స్ గా రిలీజ్ కు రెడీ అవుతుంది. అయితే చుట్టమల్లే సాంగ్ రికార్డు వ్యూస్ కొల్లగొట్టింది. సోషల్ మీడియాలో ఇఫ్పుడుడ ఎక్కడ చూసినా ఇదే పాట. ఎన్టీఆర్ కు చాలా రోజుల తర్వాత మెలోడీ సాంగ్ పడిందంటున్నారు ఫ్యాన్స్.ఈ పాటకి ఎన్టీఆర్ పాత సినిమాల్లోని ఆడియోను మిక్స్ చేసి కొంతమంది వీడియోలు ఎడిట్ చేస్తున్నారు. ట్యూన్ కూడా చాలా బాగా సెట్ అయ్యి..ఎన్టీఆర్, జాన్వీ యమదొంగ పాటకే డ్యాన్స్ చేసినట్లుంది.


రాజమౌళి డైరెక్షన్‌లో ఎన్టీఆర్ చేసిన యమదొంగ సినిమాలో మమతా మోహన్‌దాస్‌తో ఎన్టీఆర్ చేసిన "నువ్వు ముట్టుకుంటేనే తట్టుకుంటాను" సాంగ్ ను చుట్టమల్లే సాంగ్ కు ట్రాక్ ను వేశారు,. ఆ ఆడియోకి వీరిద్దరు డ్యాన్స్ చెయ్యడం ఇంకా బాగుందంటున్నారు . ఫ్యాన్స్ మేడ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియోలో  చక్కర్లు కొడుతుంది.
దేవరకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ఎప్పటి నుంచో టాక్ నడుస్తుంది. తండ్రికొడుకుల పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నట్లు టాక్. మరోవైపు ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్‌లో కనిపించబోతున్నారు. అలానే హీరో శ్రీకాంత్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ భారీ క్రూతో ప్లాన్ చేస్తున్నారు వచ్చే నెల తెలుస్తుంది కలక్షన్లు ఎంత కొల్లగొడుతుందో..
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu devara-second-song chuttamalle-song yamadonga

Related Articles