Fatty liver: మీ చర్మం నల్లగా మారుతుందా..అయితే ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ అవ్వొచ్చు!

స్కిన్ నల్లగా మారడం లేదా...నల్లని మెడ. ఎర్రని మచ్చలు ఇలా కొన్ని లక్షణాలు కనిపిస్తే ఫ్యాటీ లివర్ ఉన్నట్టే అంటున్నారు డాక్టర్లు. అసలు ఆ లక్షణాలేంటో చూసేద్దాం.


Published Nov 21, 2024 04:08:00 PM
postImages/2024-11-21/1732185707_img17043555019941a27957e921048329c2b8f0e0b3fef5f1200x.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : నిజానికి చెప్పి చెప్పి ..ఇక రోగాలన్నీ అయిపోయింటాయ్ అనుకుంటాం.. కాని కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. చర్మం ఇఫ్పుడు నల్లగా అయిపోవడం...లేదా ట్యాన్ అయిపోవడం లాంటివి చాలా కామన్ అనుకుంటాం కాని స్కిన్ నల్లగా మారడం లేదా...నల్లని మెడ. ఎర్రని మచ్చలు ఇలా కొన్ని లక్షణాలు కనిపిస్తే ఫ్యాటీ లివర్ ఉన్నట్టే అంటున్నారు డాక్టర్లు. అసలు ఆ లక్షణాలేంటో చూసేద్దాం.


శరీరంలో టాక్సిక్స్ ఎక్కువ గా ఉన్నపుడు లివర్ లో మార్పులు వచ్చి ...ఉన్నదాని కంటే కాస్త ఎక్కువ వాచి ఉంటుంది.

శరీరంలో పేరుకునే వ్యర్థాల వల్ల చర్మంపై, లింఫ్ గ్రంథులపై ప్రభావం పడుతుందట. దీని వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. 
* ఫ్యాటీ లివర్ సమస్య తలెత్తినప్పుడు కాలేయంలో ఉత్పత్తయే కొన్ని ప్రొటీన్లు తగ్గిపోతాయి. దానితో రక్త ప్రసరణ తీరు, వ్యర్థ ద్రవాల తొలగింపు ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. యూరిన్ చాలా ముదురు రంగులో వస్తుంది. కాస్త కడుపు కింది భాగంలో నొప్పి గా ఉంటుంది.


*ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చినవారి శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. దీని వల్ల మెడ ..మీ శరీర రంగు కంటే ఎక్కువ మోతాదులో నల్లగా ఉంటుంది. చర్మం ముడతలు పడి ఎక్కువ వయసులా కూడా కనిపిస్తుంది.


* ఫ్యాటీ లివర్ సమస్య ముదిరితే... పచ్చ కామెర్ల వ్యాధి వస్తుంది. చర్మం, కళ్లలోని తెల్లటి భాగం పసుపు వర్ణంలోకి మారుతాయి. మూత్రం కూడా ముదురు పసుపు, నారింజ రంగుల్లో వస్తుంది. దీని వల్ల మీరు కాస్త తెలుసుకోవచ్చు.


* కాలేయం రక్తంలోని బైల్ సాల్ట్స్ ను బ్రేక్ చేస్తుంది. ఫ్యాటీ లివర్ వల్ల చాలా మంది చర్మం దురదలు పుడుతుంటుంది. అలర్జీలు ఎక్కువై మందులు వాడాల్సిన పరిస్థితి వస్తుంది.


* కాలేయ సమస్య మరింత ముదిరినప్పుడు చర్మంపై ఎరుపు రంగులోని మచ్చలు ఏర్పడుతాయి. చాలా మంది వీటిని నార్మల్ గా లైట్ తీసుకుంటారు. కాని ఈ మచ్చలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను కలవాలి.


అయితే ఇలాంటి అసాధారణ లక్షణాలు కనిపించడం అంటే... ఏదో ఒక ఆరోగ్య సమస్య మాత్రం ఉన్నట్టేనని స్పష్టం చేస్తున్నారు. ఫ్యాటీ లివర్ అనే కాదు...చిన్న సమస్యను కూడా లైట్ తీసుకోకూడదు. వెంటనే డాక్టర్ ను కలవాలి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu suger fatyacids health-problems

Related Articles