Residential: బాధలు చెప్పుకొని కన్నీరు పెట్టుకున్న విద్యార్థులు

 సీఎం రేవంత్ రెడ్డి వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చేంత వరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ దర్నా చేశారు.  
 


Published Aug 31, 2024 02:18:38 PM
postImages/2024-08-31//1725094118_newslinetelugu89.jpg

న్యూస్ లైన్ డెస్క్: పాలమాకుల గురుకుల పాఠశాలకు మాజీ మంత్రులు, హరీష్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, ఇతర BRS నాయకులు వెళ్లారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురుకుల విద్యార్ధిలు శుక్రవారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చేంత వరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ దర్నా చేశారు.  


ఈ అంశంపై స్పందించిన BRS నేతలు విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకునేందుకు స్వయంగా గురుకుల పాఠశాలకు వెళ్లారు. హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిని కలిసిన విద్యార్థినులు తమ గోడువెళ్లబోసుకున్నారు. తమ సమస్యలను తీర్చాలంటూ కన్నీరు పెట్టుకొని సబితా ఇంద్రారెడ్డి కాళ్లపై పడ్డ తీరు చూస్తే గుండె తరుక్కుపోతోంది. 

అన్నంలో, పప్పులో పురుగులు వస్తున్నాయని యాజమాన్యానికి చెబితే తీసి తినమని చెప్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. వారంలో ఐదు రోజులు ఎగ్స్ ఇవ్వాలి, రెండుసార్లు మాత్రమే ఇస్తున్నారు, మటన్ రెండు సార్లు పెట్టాలి, అసలు ఒకసారి కూడా పెట్టట్లేదు, చికెన్ ఒకసారి పెడుతున్నారని వెల్లడించారు. టీచర్లు సన్నబియ్యం వండుకొని తింటున్నారని.. తమకు మాత్రం దొడ్డు బియ్యం వండి పురుగులన్నం పెడుతున్నారని విద్యార్థినులు తెలిపారు. 

రోజు ఐదు లీటర్ల పాలు పక్కన పెట్టుకుని రోజంతా ఉపాధ్యాయులు చాయ్ తాగుతారని వెల్లడించారు. టీచర్లు  సమయానికి రారుని తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి సమయం కాకముందే వెళ్లిపోతారని విద్యార్థినుల తెలిపారు. మరో టీచర్ వచ్చి.. ఎస్సీ, ఎస్టీ అంటూ కూలాల పేర్లతో తిడుతుందని. మీ దగ్గర వాసన వస్తోంది. స్నానం చేయరా అని తక్కువ చేసి మాట్లాడతారని విద్యార్థినులు వాపోయారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తనకు చెప్పాలని గురుకుల విద్యార్థినులకు హరీష్ రావు తన ఫోన్ నంబర్ ఇచ్చారు.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu telanganam congress-government

Related Articles