sheakar kammula: శేఖర్ కమ్ముల ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఆ హీరోతోనే

శేఖర్ కమ్ముల కోసం తెలుగు లో మాత్రమే తెలుసు. ఇంత క్లాసీ డైరక్టర్ గురించి బయట ఇండస్ట్రీలు కూడా తెలుసుకునే అవకాశం వచ్చింది.


Published Sep 14, 2024 11:30:00 AM
postImages/2024-09-14/1726293705_7cae0135f504e0aecd0dd00b7b033768.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: శేఖర్ కమ్ముల కెరీర్ లో క్లాసీ హిట్స్ ఎన్నో ఉన్నాయి. శేఖర్ కమ్ముల కోసం కాసుకుకూర్చునే వాళ్లు చాలా మందే ఉన్నారు. సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కుబేర పేరుతో సినిమా చేస్తున్నారు. ఇదే శేఖర్ కమ్ముల ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. అయితే శేఖర్ కమ్ముల కోసం తెలుగు లో మాత్రమే తెలుసు. ఇంత క్లాసీ డైరక్టర్ గురించి బయట ఇండస్ట్రీలు కూడా తెలుసుకునే అవకాశం వచ్చింది.


రానా హీరోగా నటించిన తొలి చిత్రం ‘లీడర్’ శేఖర్ దర్శకత్వంలోనే తెరకెక్కింది. “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక, ఫిదా, లవ్ స్టోరీ” ఆనంద్, గోదావరి అసలు ఒక్కో సినిమా ఒక్కో మాస్టర్ పీస్. ఇప్పుడు తన సత్తా పాన్ ఇండియా లెవెల్ లో చూపించాలనుకుంటున్నాడు. తమిళ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తున్నారు. ధనుష్ లాంటి పెద్ద హీరోతో కూడా శేఖర్ కమ్ముల ఫస్ట్ టైం సినిమా చేస్తున్నారు. 


ఈ చిత్రం పూర్తి కావొస్తుంది. శేఖర్ కమ్ముల వెంటనే తర్వాత సినిమాకు ప్లాన్ చేసేస్తున్నాడు.. ఈ నేపధ్యంలో శేఖర్ కమ్ముల నెక్ట్స్ చిత్రం ఏమిటనేది ప్రచారంలోకి వచ్చింది.  శేఖర్ కమ్ముల....నాని కోసం కథ రెడీ చేసినట్టు సమాచారం. నానితో చెయ్యాలని శేఖర్ కమ్ముల ప్లాన్ చేసుకుంటున్నారట. సాయిపల్లవి హీరోయిన్ గా చెయ్యాలని సార్ ప్లాన్. వర్కవుట్ కాని అయితే క్రేజీ కాంభినేషన్.


వాస్తవానికి బలగం వేణు డైరక్షన్ లో నాని సినిమా చెయ్యాల్సి ఉంది. దిల్ రాజు ఆ సినిమాని నిర్మించనున్నారు. అయితే నాని ...శేఖర్ కమ్ముల వైపు మ్రొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హీరో నాని హిట్ 3 కోసం రెడీ అవుతుండగా..అలాగే సుజిత్ డైరెక్షన్‌లో ఒక సినిమా, దసరా డైరెక్టర్ తో మరో సినిమాను నాని లైన్ లో పెట్టాడు. చూడాలి ఫస్ట్ ఏ సినిమా అనౌన్స్ చేస్తారో.

newsline-whatsapp-channel
Tags : cinema-news heronani saipallavi

Related Articles