సిగరెట్స్ స్మోకింగ్ ఇంజురస్ టు హెల్త్ ఆ ప్యాకెట్ పైన రాసి ఉంటుంది. అయినా కానీ తాగే వారు దాన్ని తాగడం మానేయరు. అలా సిగరెట్ తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరమని తెలిసినా దాని భారిన
న్యూస్ లైన్ డెస్క్: సిగరెట్స్ స్మోకింగ్ ఇంజురస్ టు హెల్త్ ఆ ప్యాకెట్ పైన రాసి ఉంటుంది. అయినా కానీ తాగే వారు దాన్ని తాగడం మానేయరు. అలా సిగరెట్ తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరమని తెలిసినా దాని భారిన పడుతూ ఉంటారు. అలా సిగరెట్ తాగుతూ చాలామంది ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడి మరణించిన ఘటనలు మనం రోజు చూస్తూనే ఉంటాం. ఒక్కొక్క రోజుకి ఒక డబ్బా సిగరెట్ కంటే ఎక్కువగా తాగుతూ ఉంటారు. వారు ఖాళీగా ఉంటే చాలు ఒక సిగరెట్ మొత్తం పీల్చేస్తారు.
సిగరెట్ తాగుతూ వారు ఆరోగ్యం చెడగొట్టుకోవడమే కాకుండా పర్యావరణ కాలుష్యం చేస్తూ ఇతరులను కూడా చెడగొడుతున్నారు. ధూమపానానికి బానిసైన వారు ఇక మానడం చాలా కష్టం. ఒక పూట ఆహారం లేకుండా అయినా ఉంటారు కానీ సిగరెట్ లేకుండా మాత్రం బ్రతకలేరు. అలా 20 ఏళ్లపాటు రోజుకు 10 నుంచి 12 సిగరెట్లు తాగిన ఒక వ్యక్తి ఒక్కసారిగా సిగరెట్ తాగే అలవాటుకు గుడ్ బై చెప్పాడట. అయితే ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా అయినటువంటి ఎక్స్ లో రాస్కొచ్చారు.
నేను గత 24 సంవత్సరాల నుంచి రోజుకు 10 నుంచి 12 సిగరెట్లు తాగుతూ వచ్చాను. నా పుట్టినరోజు నుంచి నేను సిగరెట్ తాగడం మానేయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటికే నేను సిగరెట్ మానేసి ఇప్పటికి 17 రోజులు గడిచిపోయింది. పోస్ట్ చేయడంతో ఇప్పటికే లక్షలాదిమంది చూస్తూ పోస్టుకు లైక్ కొట్టి కామెంట్లు పెడుతున్నారు. దీనిపై మీ కామెంట్ కూడా తెలియజేయండి.