హుస్సేన్‌సాగర్ నుంచి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద వస్తోంది. ఇప్పటికే సాగర్‌లో వరద ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నీటి మట్టం 513.41 మీటర్లు దాటినట్లు తెలుస్తోంది. ఇది హుస్సేన్‌సాగర్ పూర్తి స్థాయి అని అధికారులు వెల్లడించారు. దీంతో హుస్సేన్‌సాగర్ నుంచి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.
ఇటు వరదల న్వేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 26 గేట్లను కూడా ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం 12 గేట్లను 10 అడుగుల మేర, 14 గేట్లను 10 గెట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ ఇన్‌ఫ్లో 4,91,792, ఔట్‌ఫ్లో 5,01,014 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 588.90 అడుగులు ఉంది.