రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయిని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయిని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. ఉత్తర అంతర్గత కర్ణాటక, పరిసర తెలంగాణ ప్రాంతం వద్ద కొనసాగిన ఆవర్తనం రాయలసీమ, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి. మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుందని వాతావరణ అధికారులు తెలిపారు. మంగళవారం, బుధవారం రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని సూచించింది. ఇక సోమవారం రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి బుధవారం వరకు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.