Khammam: మున్నేరు బాధితుల కోసం ఏపీ హెలికాఫ్టర్

వెంకటేశ్వరనగర్‌ కాలనీలలో వరద ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. దానవాయిగూడెంలో ఇళ్లు పూర్తిగా నీటమునిగాయి. మరోవైపు బ్రిడ్జ్‌పై వరదలోనే 9 మంది చిక్కుకున్నారు. 


Published Sep 01, 2024 05:41:37 PM
postImages/2024-09-01/1725192697_munneruvictims.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఖమ్మం పట్టణంలోని మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రభావంతో మున్నేరు బ్రిడ్డికి పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో మున్నేరు పరివాహక కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. వరద కారణంగా పలు కాలనీలు నీటిలో చిక్కుకుపోయాయి. రాజీవ్‌ గృహకల్పలోని అపార్టుమెంట్లలో రెండో అంతస్థు వరకు నీళ్లు చేరుకున్నారు. 

వెంకటేశ్వరనగర్‌ కాలనీలలో వరద ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. దానవాయిగూడెంలో ఇళ్లు పూర్తిగా నీటమునిగాయి. మరోవైపు బ్రిడ్జ్‌పై వరదలోనే 9 మంది చిక్కుకున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. అధికారులు స్పందించి తమను సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని కోరారు. 

దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. సహాయక చర్యలు ప్రారంభించింది. మున్నేరు వాగు బ్రిడ్జిపై చిక్కుకున్న బాధితుల్ని రక్షించేందుకు హెలికాఫ్టర్‌ను తెప్పిస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో తెలంగాణలో ఉన్న హెలికాఫ్టర్లు పని చేయని పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు. దీంతో విశాఖ నావెల్ బేస్ నుంచి డిఫెన్స్ హెలికాఫ్టర్ తెప్పిస్తున్నట్లు వెల్లడించారు. 
 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu congress telanganam congress-government

Related Articles