Rajtarun:హీరో రాజ్ తరుణ్ లావణ్యను వదిలేయడానికి ఇదే కారణమా.?

Published 2024-07-05 02:43:25

postImages/2024-07-05/1720165028_raj.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో రాజ్ తరుణ్ అంటే తెలియని వారు ఉండరు.  షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందారు.  ఈ చిత్రం తర్వాత ఆయనకు మంచి పేరు వచ్చిన మూవీ కుమారి 21ఎఫ్. ఈ చిత్రాల తర్వాత అందగాడు, లవర్,సినిమా చూపిస్తా మామ  వంటి చిత్రాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అయితే రాజ్ తరుణ్ చేసిన సినిమాలు గత కొన్ని రోజులుగా హిట్ అవ్వకపోవడంతో ఆయనకు ఆఫర్లు రావడం లేదు. కరోనా సమయం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాజ్ తరుణ్.  

ఈ ఏడాది నాగార్జున హీరోగా చేసిన మూవీ లో నాగ్ తో పాటు కలిసి నటించారు.నా సామి రంగా చిత్రం సంక్రాంతి కి రిలీజ్ అయ్యి హిట్ అయింది.  ఇక  అప్పటినుంచి రాజ్ తరుణ్ నుంచి పెద్దగా సినిమాలు ఏమీ లేవు. అలాంటి రాజ్ తరుణ్ తాజాగా మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.హీరో రాజ్ తరుణ్ లావణ్య అనే యువతిని ప్రేమించాడట. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోజు తీరగానే మరో హీరోయిన్ తో  తిరుగుతూ లావణ్య కు హ్యాండ్ ఇచ్చాడట. దీంతో కోపానికి వచ్చిన లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసింది.

  తనతో కొన్ని సంవత్సరాల నుంచి సహజీవ** చేసిన రాజ్ తరుణ్ మరో హీరోయిన్ వెంట తిరుగుతూ నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నదట. అంతేకాదు రాజ్ తరుణ్ నన్ను దేవాలయంలో పెళ్లి చేసుకున్నాడని దానికి సంబంధించిన ఫోటోలను కూడా పోలీసులకు ఇచ్చింది.  అయితే గత మూడు నెలల నుంచి నన్ను రాజ్ తరుణ్ దూరం పెడుతున్నారని వేరే హీరోయిన్లతో సంబంధాలు పెట్టుకున్నాడని, అలా ఎందుకు చేసావు అని అడిగితే తనని హత్య చేయిస్తానని బెదిరిస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది.

అయితే లావణ్య కూడా గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడింది. నన్ను ఆ కేసులో ఇరికించింది కూడా రాజ్ తరుణ్ అంటూ  ఆ ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా రాజ్ తరుణ్ తిరగబడరా సామి హీరోయిన్‌తో ఎఫైర్,
మాల్వీ మల్హోత్రాతో కూడా ఎఫైర్ పెట్టుకొని, ఆ సినిమా డైరెక్టర్ సాంటో మోహన్ వీరంకి ఇంట్లో ఉంటున్నారు. 
తరుచూ ముంబై వెళుతుండటం..ఆమె ఇక్కడికి వస్తుండటం జరుగుతోందని సమాచారం. ఈ క్రమంలోనే 
మాల్వీ ఫ్యామిలీ మెంబర్స్, బెదిరింపులు మొదలు పెట్టారు. డబ్బులు ఇస్తాం, వదిలేయ్ అని చెప్పారట.  ఈ విధంగా అనేక మంది హీరోయిన్లతో, బయట యువతులతో సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది.