trump: టిట్ ఫర్ టాట్ ..ట్రంప్ కు షాక్ ఇచ్చిన చైనా !

అమెరికా నుంచి దిగుమతి చేసుకునే అన్ని ఉత్పత్తులపై 84 శాతం సుంకాలను విధిస్తున్నట్లు చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇవాళ ప్రకటించింది. అది కూడా ఈ ట్యాక్సులు ఈ రోజు నుంచే అమలులోకివస్తున్నట్లు కూడా తెలిపింది.


Published Apr 10, 2025 05:18:00 AM
postImages/2025-04-10/1744242606_images.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కొన్ని సార్లు మనం చాలా గ్రేట్ అనుకుంటాం. అప్పుడే దేవుడు గట్టిగా చెంప దెబ్బ వేస్తాడు. పొగరును అనుస్తాడు. అలా చైనా పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారం రోజుల టైంలో రెండోసారి ట్యాక్సులను పెంచారు. అయితే దీని పై డ్రాగన్ కంట్రీ రియాక్ట్ అయ్యింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే అన్ని ఉత్పత్తులపై 84 శాతం సుంకాలను విధిస్తున్నట్లు చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇవాళ ప్రకటించింది. అది కూడా ఈ ట్యాక్సులు ఈ రోజు నుంచే అమలులోకివస్తున్నట్లు కూడా తెలిపింది.


అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా ఉత్పత్తులపై రెండోసారి విధించిన 104 శాతం సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో చైనా కూడా టారిఫ్ ను పెంచేస్తూ ఇవాళే నిర్ణయం తీసుకుంది. ట్రంప్ 104 శాతం సుంకాల విధింపు ప్రకటన చేసిన తర్వాత దీని పై చైనా రియాక్ట్ అవుతూ అమెరికా చర్యను " అహంకారిత పూరిత , బెదిరింపు ప్రవర్తన " గా అభివర్ణించింది. దీనికి తను కూడా గట్టిగా రియాక్ట్ అయ్యింది. 


* మొదట ట్రంప్‌ చైనాపై అదనంగా 34 శాతం సుంకాలను విధించారు. దీంతో ఈ సుంకాల శాతం నిన్నటివరకు 54%గా ఉంది. ట్రంప్ చేసిన రెండో ప్రకటన వల్ల ఇప్పుడు చైనాపై అమెరికా సుంకాల శాతం 104కి పెరిగింది. ఇది చాలా ఎక్కువ . నిజానికి ఏదో కక్షతో చేసినట్లుగానే అనిపిస్తుంది.


*దీని కి ప్రతి చర్యగా యూఎస్‌పై డ్రాగన్‌ కంట్రీ కూడా అదనంగా 34 శాతం సుంకాలు విధించింది. ఆ నిర్ణయం కూడా ఏప్రిల్‌ 10 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా, ఇప్పుడు చైనా ఆ అదనపు సుంకాలను 84 శాతానికి పెంచింది. ఇక టైం ఇవ్వకుండా ఆ ట్యాక్సులు ఇప్పటి నుంచి అమలులోకి వస్తున్నట్లు తెలిపారు.అమెరికా 2024లో చైనాకు 143.5 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అదే సమయంలో 438.9 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. అయితే అమెరికా బిజినెస్ చేస్తుంది . చైనా ప్రొడక్ట్ తయారుచేస్తుంది. ఈ సుంకాల వల్ల ఎక్కువ శాతం అమెరికాకే నష్టం జరిగే అవకాశముంది. బెట్టు చేయక మెట్టుదిగితే మంచిది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu america tax china

Related Articles