abhinaya: భర్తతో బ్యాచ్ లర్ పార్టీ చేసుకున్న నటి అభినయ !

అయితే తన భర్తతో బ్యాచిలర్ పార్టీ సెలబ్రేట్ చేసుకొని పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 


Published Apr 10, 2025 05:34:00 AM
postImages/2025-04-10/1744243511_ActressAbhinayaEnjoyingBachelorPartyWithFriendsPhotosVIral7.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు , వెంకటేష్ చెల్లి క్యారక్టర్ చేసిన అమ్మాయి అభినయ. రీసెంట్ గా తన కాబోయే శ్రీవారి పిక్స్ ను షేర్ చేసి తన పెళ్లి జరగబోతుందనే హింట్ ఇచ్చింది. అయితే తన భర్తతో బ్యాచిలర్ పార్టీ సెలబ్రేట్ చేసుకొని పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 


పూరీ జగన్నాథ్, రవితేజ కాంబోలో వచ్చిన నేనింతే సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది. ఇండస్ట్రీలో ఉన్న చాలా తక్కువ మందిలో ఉన్న క్లాసీ యాక్టర్స్ లో  ఈమె కూడా ఒకరు. పుట్టుకతోనే మూగ , చెవుడు అయినా  ఒక నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు, మళయాలం, తమిళంలో ఎక్కువ ఫేమ్ తెచ్చుకుంది.విశాల్ ను పెళ్లి చేసుకుంటున్నట్లు రూమర్స్ వచ్చినా ...ఎట్టకేలకు తన ఫ్రెండ్ ను 15 యేళ్లుగా ప్రేమిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.


ఇక మార్చి 9న ఘనంగా వీరి వివాహం జరగగా, త్వరలో పెళ్లి పీటలెక్కబోతుంది ఈ కుందనపు బొమ్మ. తన చిరకాల స్నేహితుడు, కాబోయే భర్త సన్నీ వర్మ తో కలిసి బ్యాచ్ లర్ పార్టీ చేసుకుంది. ఈ నెల 16 తారీఖున ఘనంగా వీరి వివాహం జరగనుంది. తన చిన్ననాటి స్నేహితుడిని భర్త గా చేసుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని తెలిపింది.


దీనికి సంబంధించిన ఫొటోలు ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తన కాబోయే భర్త, స్నేహితులతో ఈ అమ్మడు చాలా ఎంజాయ్ చేస్తుంది. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu wedding social-media party

Related Articles