samantha: ఎక్స్ లో సమంత రీ ఎంట్రీ ...పిక్స్ షేర్ చేసిన సామ్ !

హర్రర్ కామెడీ మూవీగా ఈ సినిమా రాబోతుంది. సమంత మళ్లీ ఎక్స్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడంపై ఆమె ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అవుతున్నారు.


Published Apr 07, 2025 06:22:00 PM
postImages/2025-04-07/1744030492_20250315130335SamanthaRuthPrabhucompletesfirstfilmasproducer.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : స్టార్ హీరోయిన్ సమంతకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కొంత కాలంగా సమంత ఎక్స్ కు దూరంగా ఉంటుంది. ఇన్సాటా , యూట్యూబ్ , ఫేస్ బుక్ లోనే యాక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ గా ఎక్స్ వేదికగా సామ్ రీ ఎంట్రీ ఇచ్చింది. ఎక్స్ లో సమంతకు కోటికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.  రీసెంట్ గా సమంత ప్రొడ్యూసర్ గా మారిన సంగతి తెలిసిందే. శుభం అనే సినిమాను తన సొంత ప్రొడక్షన్ లో సినిమా రిలీజ్ చేస్తున్నారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్ పేరుతో ఆమె సొంత ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసుకుంది. తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా ఆమె శుభం నిర్మించింది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో సమంత నిర్మించింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను సమంత ఎక్స్ లో రిలీజ్ చేసింది. హర్రర్ కామెడీ మూవీగా ఈ సినిమా రాబోతుంది. సమంత మళ్లీ ఎక్స్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడంపై ఆమె ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అవుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu samatha samantha social-media socialmedia

Related Articles