అయితే ఈ ఎన్నికల్లో రోజా ఓడిపోయింది. అయితే ప్రతిపక్ష హోదాకూడా లేదు. సో మరో సారి టీవీ షోలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రోజా .
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా సినిమాలు మానేసిన తర్వాత జబర్ధస్త్ లాంటి చాలా షోలో కనిపించి అలరించిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి వచ్చిన తర్వాత రోజా జబర్ధస్త్ ను కూడి వదిలేసి టీవీ షోలు , సినిమాలు చేయను అని చెప్పేసి వెళ్లిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది. అయితే ఈ ఎన్నికల్లో రోజా ఓడిపోయింది. అయితే ప్రతిపక్ష హోదాకూడా లేదు. సో మరో సారి టీవీ షోలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రోజా .
రీసెంట్ గా జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4 లో ఓ ఎపిసోడ్ కి వచ్చి అలరించింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. ఇప్పుడు మరోసారి రోజా జడ్జిగా వచ్చిందని తెలుస్తుంది. జీ తెలుగులో డ్రామా జూనియర్స్ కొత్త సీజన్ మొదలు కానుంది. తాజాగా ఈ సీజన్ ప్రోమో రిలీజ్ చేసారు. డ్రామా జూనియర్స్ షోలో కి రోజా రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ షోకి సుధీర్ యాంకర్ . రోజాతో పాటు ఆమని , డైరక్టర్ అనిల్ రావిపూడి ఈ షోకి జడ్జిలుగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ షో ఓపెనింగ్ ఎపిసోడ్ కి జగపతి బాబు రాగా ఆయనతో కలిసి రోజా , ఆమని డ్యాన్సులు వేసి అలరించారు. దీంతో ప్రొమో వైరల్ గా మారింది. ఈ షో ఓపెనింగ్ ఎపిసోడ్ కి జగపతి బాబు వచ్చారు. ఆయనతో ఆమని ...రోజా కలిసి డ్యాన్స్ చేశారు. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. డ్రామా జూనియర్స్ షో తో రోజా మళ్లీ టీవీ లలో బిజీగా మారనుంది.