అయితే, తన కుటుంబసభ్యులకు సంబంధించిన అక్రమ కట్టడాలు ఉంటే చెప్పండి.. నేనే కూల్చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా చర్చనీయాంశంగా మారింది. చెరువుల పరిరక్షణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి.. హైడ్రా కమిషన్ ఏర్పాటు చేసి అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే హీరో నాగార్జునకు సంబంధించిన N-కన్వెన్షన్ కూడా కూల్చేశారు. అంతేకాకుండా, చెరువులకు సంబంధించిన భూములు, వాటి పరిసరాల్లో అక్రమంగా నిర్మించిన పలువురు బడా నేతల ఫామ్ హౌస్‌లకు కూడా నోటీసులు పంపించారు.
అయితే, తన కుటుంబసభ్యులకు సంబంధించిన అక్రమ కట్టడాలు ఉంటే చెప్పండి.. నేనే కూల్చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకే హైడ్రా అధికారులు లిస్ట్ తయారు చేయగా సీఎం సోదరుడికి సంబంధించిన అక్రమ కట్టడాలు బయటపడ్డాయి. మాదాపూర్ అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో దుర్గం చెరువు FTL పరిధిలో సర్వే నంబర్ 47లో ఉన్న ప్లాట్ నంబర్ 54, 55లలో తిరుపతిరెడ్డి ఇల్లు నిర్మించుకున్న విషయం తెలిసిందే.
దీంతో రేవంత్ రెడ్డి సోదరుడికి కూడా హైడ్రా నోటీసులు పంపించింది. నెలలోగా అక్రమ కట్టడాలు కూల్చేయాలని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. దీంతో పాటు దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా హైడ్రా నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది.