Vichitra:నటి 'విచిత్ర' ని లైంగికంగా వేధించింది నందమూరి హీరోనా.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. వారందరిలో నందమూరి హీరోలు చాలా స్పెషల్. అన్న ఎన్టీఆర్ నట వారసులుగా ఇండస్ట్రీలోకి నందమూరి హీరోలు అయినటువంటి బాలకృష్ణ


Published Aug 26, 2024 02:15:57 PM
postImages/2024-08-26/1724661957_balayya.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. వారందరిలో నందమూరి హీరోలు చాలా స్పెషల్. అన్న ఎన్టీఆర్ నట వారసులుగా ఇండస్ట్రీలోకి నందమూరి హీరోలు అయినటువంటి బాలకృష్ణ హరికృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో హరికృష్ణ చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఆయన తర్వాత అంతటి గుర్తింపు సాధించిన హీరో బాలకృష్ణ అని చెప్పవచ్చు. అలాంటి బాలకృష్ణ  ఓవైపు సినిమాల్లో చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు.

అలాంటి ఈయన ఓ సినిమా సమయంలో నటి విచిత్రను లైంగికంగా వేధించారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ,  నందమూరి ఫ్యామిలీ అంటే పడని వారు ఈ వార్త క్రియేట్ చేశారని అర్థమవుతుంది.  బాలకృష్ణ ఇబ్బంది పెట్టిన నటి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

బాలకృష్ణ "భలేవాడివి బాసు" సినిమాలో పుష్ప అనే క్యారెక్టర్ కోసం అందంగా ఉండే ఒక అమ్మాయిని డైరెక్టర్ వెతుకుతున్నాడని తెలిసి, గుండు హనుమంతరావు విచిత్రను, ఆ క్యారెక్టర్ కు రికమెండ్ చేశారట. ఇక డైరెక్టర్ బిఏ అరుణ్ ప్రసాద్  విచిత్ర లుక్స్ చూడగానే సెట్ అవుతుందని పించిందట. ఈమెను చెన్నైలోని కేరళలోని మలంపుర అనే లొకేషన్ రప్పించారట. అంతేకాదు ఇందుకు త్రీ స్టార్ హోటల్లో బస కూడా ఏర్పాటు చేశారట. ఇక ఈ చిత్రంలో హీరోగా చేస్తున్న స్టార్ హీరో బాలకృష్ణ ఈమెను లైంగికంగా వేధించారని అతని వేధింపుల కారణంగానే నాకు కాబోయే భర్తను నేను హోటల్లో కలిశానని చెప్పుకొచ్చిందట విచిత్ర.

బాలకృష్ణ ప్రతిరోజు నా గది తలుపు తట్టేవారని, ఆ చిత్రం షూటింగ్ జరిగినన్ని రోజులు ఆ గండం నుంచి ఎలా బయటపడాలో నాకు అర్థం కాక, నా రూమ్ లో ఉన్న ఫోన్ కి ఎవరి నుంచి కూడా ఫోన్స్ రాకుండా చూడమని ఆ హోటల్ సిబ్బందికి నేను చెప్పుకున్నానని, అలా హోటల్ మేనేజర్ నా పరిస్థితిని అర్థం చేసుకొని, చిత్ర యూనిట్ కి   తెలియకుండా నన్ను రోజు ఒక గదికి షిఫ్ట్ చేస్తూ, ఉండేవారు ఇలా ఆ హీరో తాగి వచ్చి నేను పాత రూమ్ లో ఉన్నాను అనుకోని రోజు వచ్చి తలుపు తట్టేవాడు. ఇలా ఆ సినిమా షూటింగ్ అయ్యేవరకు నేను అనేక ఇబ్బందులు పడ్డానని నటి విచిత్ర చెప్పుకొచ్చింది. ఇందులో ఎంతవరకు నిజముందో, అబద్ధం ఉందో తెలియదు కానీ దీనికి సంబంధించిన వార్త మరోసారి వైరల్ అవుతుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu balakrishna vichitra balevadivi-boss arun-prasad-director gundu-hanumantha-rao

Related Articles