Jayalalitha: రమాప్రభే కాదు ..జయలలిత కూడా శరత్ బాబు భార్యే !

రమాప్రభ మాత్రమే శరత్ బాబు వైఫ్ అని అందరికి  తెలుసు. కాని జయలలిత కూడా శరత్ బాబు ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తే.


Published Aug 07, 2024 07:03:00 PM
postImages/2024-08-07/1723037624_actressjayalalithaa.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: జయలలిత ...బ్యూటిఫుల్ క్లాసికల్ డాన్సర్ . మంచి క్యారక్టర్ ఆర్టిస్ట్ కూడా. 90 ల్లో,80 లో వందల సినిమాలు చేసినా ..అడపా దడపా మాత్రమే తెరపై కనిపిస్తున్నారు. రీసెంట్ గా యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో  ఓ ఇంట్రస్టింగ్ విషయం బయటపెట్టారు. ఇన్నాళ్లు రమాప్రభ మాత్రమే శరత్ బాబు వైఫ్ అని అందరికి  తెలుసు. కాని జయలలిత కూడా శరత్ బాబు ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తే.


జయలలిత అసలు పేరు లలిత...జయ అనే పేరు ఇండస్ట్రీ పెద్దలు పెట్టిన పేరు.  ఈ పేరుతో మద్రాస్ లో చాలా ఇబ్బందులు పడ్డాను. 'అమ్మ పార్టీ' వారు నన్ను బెదిరించారు కూడా. అమ్మ పేరు పెట్టుకుని కామెడీ వేషాలు వేయడానికి వీల్లేదని హెచ్చరించారు. అయినా బెదరలేదు..నా పేరును అలానే కంటిన్యూ చేశాను. ఇక శరత్ బాబుని ఎలా కలిసానంటే .. 'ఆలాపన' సినిమా సమయంలో వంశీ గారిని కలిశాను. అప్పటి నుంచి ఆయన నాకు వరుసగా అవకాశాలు ఇస్తూనే వచ్చారు. అలా నేను నిలదొక్కుకోవడంలో ఆయన పాత్ర ఉంది.


"శరత్ బాబుగారితో పెళ్లి అనుకున్నాను...గుడికి కూడా వెళ్లాం ... ఇండస్ట్రీ లో ఎవరో వద్దన్నారు..విడిపోయాం. అయితే మా ప్రేమలో నేను స్ట్రాంగ్ గా ఉన్నాను. కాని ఆయన సగం మాత్రమే ప్రేమించారు. నేను ఆయనతో పిల్లల్ని కనాలనేంత ఆలోచించాను..కాని  జీవితంలో ఇల్లు .. పెళ్లి .. పిల్లలు అనేవి ఉండటానికి ప్రాప్తం ఉండాలి. అవి ఈ జీవితానికి లేనట్టే" అని అన్నారు జయలలిత.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movies movie-news

Related Articles