జయం రవి ప్రస్తుతం బ్రదర్ సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు.అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈయనకు విడాకుల పై ప్రశ్నలు ఎదురయ్యాయి.ఎందుకంటే ఈ మధ్యనే విడాకులు తీసుకున్న సెలబ్రిటీ కాబట్టి కచ్చితంగా ప్రమోషన్స్ లో ఈ
న్యూస్ లైన్ డెస్క్: జయం రవి ప్రస్తుతం బ్రదర్ సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు.అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈయనకు విడాకుల పై ప్రశ్నలు ఎదురయ్యాయి.ఎందుకంటే ఈ మధ్యనే విడాకులు తీసుకున్న సెలబ్రిటీ కాబట్టి కచ్చితంగా ప్రమోషన్స్ లో ఈ ప్రశ్నలు ఎదురవుతాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అయితే ఇదే ప్రమోషన్స్లో తన ఎఫైర్ గురించి కూడా కొంతమంది ప్రశ్నలు అడిగారు.
సింగర్ కెనీషాతో మీరు నిజంగానే రిలేషన్ లో ఉన్నారా.. కెనీషా కోసమే మీ భార్యకి విడాకులు ఇచ్చారా.. అంటూ ఇలా ఎంతోమంది ఆయనను ప్రశ్నలతో వేధించారు.. కానీ జయం రవి మాత్రం ఇలాంటి ప్రశ్నలు నన్ను అడగకండి.. అలాగే ఆ అమ్మాయిని కూడా ఇందులోకి లాగకండి. ఆమె చాలా మంచి అమ్మాయి. ఆమెకు నాకు అలాంటి సంబంధం లేదు. ఆమె ఒక మంచి సైకాలజిస్ట్.ఎంతో మందిని మానసికంగా బాధపడుతుంటే వారిని ఆ మానసిక వ్యాధి నుండి బయట పడేసింది.
ఇక త్వరలోనే కెనీషాతో కలిసి నేను ఒక మంచి ఆధ్యాత్మిక మైనటువంటి ట్రస్టును ఏర్పాటు చేయాలని చూస్తున్నాను. ఆమెతో నాకు ఇంకొకసారి లింకప్ చేస్తూ వార్తలు రాయకండి. అలాగే ఆర్తి చేసిన కామెంట్స్ లో ఎలాంటి నిజం లేదు. విడాకుల విషయం ఆమెకు తెలుసు. అలాగే ఆమె తండ్రికి కూడా తెలుసు. నా పెద్ద కొడుకుకి కూడా ఈ విషయాన్ని నేను చెప్పాను. మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నాం అని నా కొడుకుకు చెప్పాను. కానీ చిన్న బాబుకి అర్థం కాదు కాబట్టి వాడికి ఏమీ చెప్పలేదు.
విడాకులు నాకు తెలియదు అని ఆర్తి మాట్లాడే దాంట్లో ఎలాంటి నిజం లేదు.నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. నా లాయర్ నుండి ఆమెకి నోటీసులు కూడా పంపించాను అంటూ జయం రవి మాట్లాడారు. అయితే జయం రవి మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో అటు భార్యకు విడాకులు ఇచ్చిన వెంటనే సింగర్ తో ఎఫైర్ వార్తలు వచ్చిన కూడా వాటన్నింటినీ పక్కనపెట్టి ప్రియురాలితో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు