Kalki:"కల్కి" మూవీకి విజయ్ దేవరకొండ పారితోషకం తెలుసా.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో  రౌడీ హీరోగా గుర్తింపు పొందారు విజయ్ దేవరకొండ. అలాంటి విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. అయితే తాజాగా ఆయన నటించిన కొన్ని సినిమాలు వరుసగా ప్లాప్ అవుతూ వచ్చాయి.  ఖుషి సినిమా కాస్త హిట్ అయింది కానీ  అంతకుముందు వచ్చిన  రెండు సినిమాలు ఘోరంగా ప్లాప్ అయ్యాయి. అయినా విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అలాంటి ఈ రౌడీ హీరో తాజాగా  ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి కల్కి  2898Ad చిత్రంలో నటించారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-06-30/1719736556_vijay.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో  రౌడీ హీరోగా గుర్తింపు పొందారు విజయ్ దేవరకొండ. అలాంటి విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. అయితే తాజాగా ఆయన నటించిన కొన్ని సినిమాలు వరుసగా ప్లాప్ అవుతూ వచ్చాయి.  ఖుషి సినిమా కాస్త హిట్ అయింది కానీ  అంతకుముందు వచ్చిన  రెండు సినిమాలు ఘోరంగా ప్లాప్ అయ్యాయి. అయినా విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అలాంటి ఈ రౌడీ హీరో తాజాగా  ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి కల్కి  2898Ad చిత్రంలో నటించారు.

 సినిమా రిలీజ్ అయి మూడు రోజులు అవుతున్న కలెక్షన్స్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఈ చిత్రంలో చాలామంది స్టార్ నటులు నటించారు. మొత్తం ఈ సినిమాకి సంబంధించి రూ:600 కోట్ల బడ్జెట్ అయిందట. రెండు రోజుల్లోనే దాదాపు రూ:300 కోట్లు రాబట్టిన ఈ మూవీ  రాబోవు రోజుల్లో లాభాల్లో కొనసాగుతుందని అంటున్నారు.  అయితే ఈ చిత్రంలో స్టార్ నటులైనటువంటి అమితాబు, ప్రభాస్, దీపికా పడుకొనే, దిశా పటాని, కమలహాసన్ వంటి వారు నటించారు. ఇక మరి కొంతమంది గెస్ట్ రోల్స్ లో నటించారు.  

ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దుల్కర్, సల్మాన్, శోభన, విజయ్ దేవరకొండ, రామ్ గోపాల్ వర్మ, మృనాల్ ఠాకూర్, ఫరియా అబ్దుల్లా, జక్కన్న. అయితే ఈ మూవీలో అర్జునుని పాత్ర చేసిన విజయ్ దేవరకొండ  అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన పాత గురించే సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతుంది.  కేవలం  ఈ పాత్రలో ఐదు నిమిషాలు మాత్రమే విజయ్ దేవరకొండ కనిపిస్తారట. అయితే ఈ పాత్ర కోసం విజయ్ దేవరకొండ దాదాపు రూ:5 కోట్ల వరకు పారితోషకం అందుకున్నారని తెలుస్తోంది.

newsline-whatsapp-channel
Tags : news-line amithab-bachchan kalki-2898-ad vijaydevarakonda kamal-haasan

Related Articles