కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలుసు కదా..తను చేసే సిల్లీ సిల్లీ పనులన్నీ ...సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలుసు కదా..తను చేసే సిల్లీ సిల్లీ పనులన్నీ ...సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ వారంలో చేసిన పనులు ఇవేనంటూ ఫోటోస్ డంప్ చేసింది. ఇన్‌స్టాలో షేర్ చేసిన పిక్స్ మిర్రర్ సెల్ఫీలు తీసుకుంటూ.. వివిధ పనులు చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది కీర్తి.
తన జిమ్ లో తీసుకున్న మిర్రర్ సెల్ఫీని ఇన్ స్టా లో షేర్ చేసింది.వాష్ రూమ్‌లో సెల్ఫీలు తీసుకునే అలవాటు కూడా కీర్తికి ఉంది. తాజాగా పింక్ కలర్ శారీ కట్టుకుని సెల్ఫీలకు క్యూట్‌గా ఫోజులిచ్చింది. ఇలా ప్రతి పిక్ ను తన ఇన్ స్టా లో పోస్ట్ చేస్తూ హ్యాపీగా ఉంటుంది.
ఫిట్నెస్ మీద దృష్టి పెట్టిన కీర్తి.. వీలు కుదిరినప్పుడల్లా జిమ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతుంది. అయితే ఫ్యాన్స్ మాత్రం మీరు చబ్బీగా ఉంటేనే బాగుంటుందంటూ ఆమెకు కామెంట్లు చేస్తున్నారు. ఏంటక్క ఇంకెంత చిక్కిపోతావ్ ...నున్నగా ..గుండుగా ఉంటేనే అందంగా ఉంటావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.