కేరళ మొన్ననే వరదతో అల్లాడిపోయింది. కాని కష్టాలు శాశ్వతం కాదు ..అందుకే ఇటీవలే ఓనం.. తాజాగా పడవ పోటీల పండుగను కనులపండవుగా జరిపారు .
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కష్టాలు ..నష్టాలు ...లాభాలు ...నష్టాలు ..దుఖం ..సంతోషం ఏది ఎఫ్పుడైనా రానీ సాంప్రదాయం సాంప్రదాయమే. నిజానికి పండుగలు మనుషులను సంతోషపరచడానికే పండుగలు. చిన్న నష్టానికి ...డీలా పడకుండా ప్రతి మాసంలో పండుగలు చేసుకునేది ఇందుకే. కేరళ మొన్ననే వరదతో అల్లాడిపోయింది. కాని కష్టాలు శాశ్వతం కాదు ..అందుకే ఇటీవలే ఓనం.. తాజాగా పడవ పోటీల పండుగను కనులపండవుగా జరిపారు .
కేరళ ప్రాంతీయులు. 70వ నెహ్రూ బోట్ ట్రోఫి రేసింగ్ ఈసారి కూడా అదిరింది. గాల్లో తేలిపోయినట్టు.. అనే ఫీల్ రావాలంటే గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ ఓనం సంబరాలను చూడాలి. పండువల పోటీ ...పాము పడవల పోటీగురించి అసలు చూసి తీరాల్సిందే. అచ్చం పాములాగా వుండే పడవలు.. వంద అడుగుల పొడవైన పడవ..అందులో వంద మంది సెయిలర్స్.. పరుగెత్తించు నా నావ అంటూ పాత పాటలతో హుషారుగా దూసుకెళ్తుంటే ఆ మజానే వేరు.ఈసారి ట్రోఫీ కోసం 19 స్నేక్ బోట్స్ బరిలోకి దిగాయి.
ఆహ్లాదకరమైన వాతావరణం.. సరస్సులో బోట్లు.. ఒడ్డున ప్రేక్షకుల సందడి…పాటలు ..మ్యూజిక్ అసలు అక్కడే ఉంటే ఆ మజా వేరు.తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఈ ప్రాంతాన్ని పర్యటించి ముగ్గుడయ్యారట. పాములాంటి పడవ ఆయన్ని బాగా ఆకట్టుకుంది. వెండితో చేసిన పాము పడవను కానుకగా ఇచ్చారు. దీనికి గుర్తుగా నెహ్రూ పేరుమీద పడవ పోటీలు జరుపుతారు.గత నెల 10న ఈ పోటీలు జరగాలి. కానీ వరద విధ్వంసం.. మంకీ పాక్స్ వల్ల జరిపించలేదు. కాని నిన్న ఈ పడవ పోటీలు చాలా హుషారుగా జరిగాయి.