కేరళలోని వయనాడ్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకారణంగా అక్కడ వాతవరణం అనుకూలంగా లేదు. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాడానికి చాలా కష్టతరంగా మారాయి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కేరళలోని వయనాడ్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకారణంగా అక్కడ వాతవరణం అనుకూలంగా లేదు. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాడానికి చాలా కష్టతరంగా మారాయి. దాదాపు 300 మంది చనిపోయారు మరో 250 మంది కనిపించకుండాపోయారు. కోలివుడ్ నుంచి ప్రముఖులంతా తమకు తోచిన సాయం తాము చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తమ టెలికాం వినియోగదారులకు జియో, ఎయిర్ టెల్ కూడా తమవంతు సహాయక చర్యలు అందించేలా చేస్తున్నాయి.
ఆ ప్రాంతాల్లో ఈ రెండు నెట్ వర్క్స్ వినియోగించిన కస్టమర్లకు ఉచితంగా సేవలను అందించాలని నిర్ణయించింది.అందులో భాగంగానే.. ఎయిర్ టెల్ రోజుకు 1జీబీ టేడా తో పాటు 100 ఎస్ ఎంఎస్ లు, అన్ లిమిటెడ్ కాల్స్ ను ఉచితంగా మూడు రోజుల పాటు అందించాలని నిర్ణయించింది. తమ నెట్ వర్క్ వాడుతున్న తమ కస్టమర్లకు అన్ లిమిటెడ్ కాల్స్ , మెసేజెస్ సేవలు అందించారు. అయితే ఇది కూడా మూడు రోజుల పాటు మాత్రమే అందిస్తున్నట్లు తెలిపారు.
వయనాడ్ లోని ప్రస్తుతం పరిస్థితుల కారణంగా.. ప్రీపెయిడ్ మొబైల్ సర్వీస్ ఎక్స్ పెయిర్ అయిపోయిన వారికి ఈ ఉచిత మొబైల్ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ అందిస్తుంది. అలాగే పోస్ట పెయిడ్ కస్టమర్లకు కోసం బిల్ డ్యూ డేట్ ను మరో మరో 30 రోజులకు పొడిగించింది.అలాగే జియో టెలికాం ఆపరేటర్ ఈ ప్రాంతంలో అంతరాయం లేని సేవలను అందించడానికి రెండో ప్రత్యేక టవర్‌ను ఇన్‌స్టాల్ చేసింది. అంతేకాకుండా.. నెట్‌వర్క్ విస్తరణ పౌరులకు, అధికారులకు ఆటంకంలేని కమ్యూనికేషన్‌ని అందిస్తుంది.